Chiranjeevi Daughter Sushmitha Clarity on Rajyasabha Seat: మెగాస్టార్ చిరంజీవిని త్వరలోనే కొత్త పాత్రలో చూడబోతున్నాం, త్వరలోనే ఆయన మళ్లీ పొలిటికల్ బాట పట్టనున్నారు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవిని.. మళ్లీ రాజకీయ తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని కేసరపల్లిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు చిరంజీవి సైతం హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలోనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మోదీని తన అన్నయ్య దగ్గరకు తీసుకెళ్లగా చిరంజీవి కూర్చున్న దగ్గరకే వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనతో మాట్లాడారు.
Darshan: లవర్ పవిత్రకు 3 అంతస్తుల ఇల్లు.. కానీ 1BHK అద్దె ఇంట్లో దర్శన్ సోదరుడు!!
ఆ తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను ఆత్మీయంగా దగ్గరకు తీసుకుని వారితో చేతులు పైకెత్తి కలిసి ప్రజలకు అభివాదం చేశారు. దీంతో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారంలో ఇదో హైలెట్ సీన్ అయింది. ఇంకేముంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. ఇక ఈ ప్రచారం మీద స్పందించారు మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత. సుస్మిత సొంత ప్రొడక్షన్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద పరువు అనే వెబ్ సిరీస్ తెరకెక్కగా అది ఈ మధ్యనే జి ఫైవ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన సుష్మితను ఈ రాజ్యసభ ఆఫర్ గురించి ప్రశ్నించగా అదేమీ లేదని ఆమె కొట్టిపారేశారు. తనకు అలాంటి విషయాలు తెలియని ఆమె అన్నారు. ఇంట్లో అయితే చాలా విషయాలు గురించి చర్చ జరుగుతాయి కాని ఈ విషయం మీద చర్చ జరగలేదని అన్నారు. ప్రస్తుతానికి పవన్ బాబాయ్ విన్నింగ్ మూమెంట్ని ఇంకా ఎంజాయ్ చేస్తున్నామని ఆమె చెప్పుకొచ్చారు
చిరంజీవి గారికి రాజ్యసభ సీటు ఇస్తున్నారు అని విన్నాము..?#SushmitaKonidela #Chiranjeevi #RamCharan #NivethaPethuraj #PraneetaPatnaik #Paruvuwebseries #NTVENT pic.twitter.com/x1HoQv4SaM
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) June 18, 2024