మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’. ఉప్పెన చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. రామ్ చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా వస్తోన్న ఈ సినిమాలు చరణ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల చరణ్ బర్త్ డే నాడు రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ లుక్ కు విశేష స్పందన లభించింది.
Also Read : NANI : హిట్ 3 లీక్స్.. శైలేష్ ఎమోషనల్ పోస్ట్
కాగా చరణ్ బర్త్ డే నాడు తన శ్రేయోభిలాషులకు ప్రత్యేక కానుకలు అందజేశారు చరణ్. ఈ సందర్భంగా చరణ్ నటిస్తున్న పెద్ది చిత్ర దర్శకుడు బుచ్చిబాబుకు చరణ్ దంపతులు ‘హనుమాన్ చాలీసా పుస్తకాన్ని, హనుమంతుడి ప్రతిమను బహుమతిగా అందజేశారు. ప్రియమైన బుచ్చి బాబు ‘నా మనసులో నీకెప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ హనుమంతుడి ఆశీస్సులు నీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని రాసిన లెటర్ ను జత చేస్తూ, శ్రీరాముల వారి పాదుకలను దర్శకుడు బుచ్చిబాబుకు పంపారు చరణ్ దంపతులు. ఆ సంతోషకరమైన సందర్భాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చరణ్ దంపతుల అద్భుతమైన బహుమతికి ధన్యవాదాలు. మీ ప్రేమ మరియు మద్దతుకు రుణపడి ఉన్నాను. హనుమంతుని ఆశీస్సులు మీతో ఉండాలని మరియు మీకు మరింత బలాన్ని మరియు శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. మీ విలువలు నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి మరియు ఎల్లప్పుడూ స్థిరంగా మరియు వినయంగా ఉండాలని మాకు గుర్తు చేస్తాయి’ అని ఎక్స్ వేదికగా ఫొటోలను షేర్ చేసాడు బుచ్చి.
Tqqq very much dear @AlwaysRamCharan Sir nd @upasanakonidela garu for the wonderful gift 🤍
Indebted to ur love nd support 🙏🏼May the blessings of Lord Hanuman be with you nd give more strength nd power to you Sir…
Your values r truly inspiring nd always remind us to stay… pic.twitter.com/1pt1k01zkz
— BuchiBabuSana (@BuchiBabuSana) April 4, 2025