ప్రముఖ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ పై తాజాగా కేసు నమోదయింది. ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అయిపోయాయి. విషయం ఏదైనా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. దీంతో ప్రముఖులపై కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పుడు అనంత శ్రీరామ్ ఈ విషయంలో కూడా అదే జరిగింది.
Read Also : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ మారుతి
నాగ శౌర్య, రీతు వర్మ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ డ్రామా “వరుడు కావలెను”. ఈ మూవీ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. రీసెంట్ గా ఈ చిత్రం నుంచి “దిగు దిగు దిగు నాగ” అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటలు నాగదేవత కించపరిచే విధంగా అనంత శ్రీరామ్ లిరిక్స్ రాశారని ఆరోపిస్తున్నారు. సాంగ్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ బిజెపి మహిళా మోర్చా నాయకురాలు బిందు రెడ్డి అనంత శ్రీరామ్ పై కేసు నమోదు చేశారు. నెల్లూరు పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఫిర్యాదు చేశారు. మరి ఈ విషయం పై చిత్ర యూనిట్, శ్రీరామ్ ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు యూట్యూబ్ లో ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.