మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ కలిసి నటిస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. జనవరి 13న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీపై తెలుగు రాష్ట్రాల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకి తగ్గట్లే మేకర్స్ కూడా ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఈ మాస్ మసాలా సినిమాని హిందీలో కూడా జనవరి 13నే విడుదల చేస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. రిలీజ్ కి రెండు వారాలు మాత్రమే సమయం ఉంది, హిందీ రిలీజ్ కి సంబంధించిన ప్రమోషన్స్ ని మేకర్స్ ఇప్పటివరకూ స్టార్ట్ చెయ్యలేదు అనే ఆందోళనలో మెగా అభిమానులు ఉన్నారు. అయితే ‘పుష్ప’ సినిమాని కూడా మైత్రీ మూవీ మేకర్స్ హిందీలో ప్రమోట్ చెయ్యలేదు కానీ అక్కడ ఆ సినిమా వంద కోట్ల మార్క్ ని రీచ్ అయ్యింది. కంటెంట్ ఉంటే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు అనే నమ్మకంలో మైత్రీ మూవీ మేకర్స్ ఉన్నారు.
మేకర్స్ నమ్మకాన్ని కాసేపు పక్కన పెడితే చిరు, రవితేజలు బాలీవుడ్ మార్కెట్ లో తమ మార్క్ ని చూపించాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. చిరు ఇటివలే నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో సల్మాన్ ఖాన్ లాంటి హీరో క్యామియో రోల్ ప్లే చేసినా కూడా అది నార్త్ లో ఆడియన్స్ ని అట్రాక్ట్ చెయ్యలేక పోయింది. ‘సైరా’ సినిమాలో కూడా అమితాబ్ లాంటి ఇండియన్ స్టార్ హీరో నటించాడు, అయినా నార్త్ ఆడియన్స్ ‘సైరా’ సినిమాని చూడలేదు. రవితేజ పరిస్థితి కూడా ఇదే, తెలుగు రాష్ట్రాల్లో కాసుల వర్షం కురిపిస్తున్న ‘ధమాకా’ సినిమా హిందీలో ‘బిగ్ ధమాకా’ పేరుతో రిలీజ్ అయ్యింది కానీ అక్కడ ఆ సినిమాని పెద్దగా సౌండ్ చెయ్యట్లేదు. రవితేజ ఇంతక ముందు నటించిన ‘ఖిలాడీ’ సినిమా కూడా నార్త్ లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలాంటి సమయంలో చిరు, రవితేజలు కలిసి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో నటిస్తూ… దాన్ని హిందీలో రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. మరి ఈ ఇద్దరు హీరోలు మాస్ కంటెంట్ తో నార్త్ ఆడియన్స్ ని ఎంతవరకూ మెప్పిస్తారో చూడాలి.
वौलतेर वीरैया in HINDI🔥
Here are the Hindi teasers💥
Grand release in cinemas on Jan 13th 2023 💥#WaltairVeerayyaOnJan13th
Megastar @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP @SonyMusicSouth @THEOFFICIALB4U @B4UMotionPics pic.twitter.com/ctWBSLiHCp— Mythri Movie Makers (@MythriOfficial) December 29, 2022