Cameraman Gangatho Rambabu Collections to be donated to Janasena Fund: “కెమెరామెన్ గంగతో రాంబాబు” సినిమా పన్నెండు ఏళ్ల క్రితం వచ్చినప్పటికీ, నాటి రాజకీయాలకే కాదు నేటి రాజకీయాలకు కూడా అద్దం పట్టే విధంగా ఉంటుంది అని నట్టి కుమార్ అన్నారు. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం 2012లో విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాను నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నట్టి కుమార్ ఈ నెల 7న ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నట్టి కుమార్ మాట్లాడారు. “ఈ సినిమా కలెక్షన్స్ కు సంబంధించి సేల్ అయిన ప్రతి టిక్కెట్ నుంచి 10 రూపాయలు జనసేనకు ఫార్టీ ఫండ్ ను అందజేస్తామని ఆయన అన్నారు.
Jr NTR: మంత్రి పొంగులేటి తమ్ముడు కొడుకు పెళ్లి.. జూనియర్ ఎన్టీఆర్ కి ఆహ్వానం
ఇక ఫ్యాన్స్ కు ప్రత్యేక విన్నపం ఏమిటంటే… . అసాంఘిక శక్తులు కావాలని ధియేటర్స్ ను నాశనం చేయాలని చూస్తే, అలాంటి వారిని పోలీసులకు, థియేటర్ యాజమాన్యానికి పట్టించండి, దేవాలయం లాంటి ధియేటర్స్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయన అన్నారు. ముఖ్యంగా మన నాయకుడికి చెడ్డ పేరు రాకుండా చూడాలని ఆయన అన్నారు. ఈ సినిమా ఈ సమయంలో రీ రిలీజ్ చేయడానికి కారణం పూర్తి పొలిటికల్ సబ్జెక్టుతో తీసిందన్న ఉద్దేశ్యమే అని న్నారు. ఇది ఆ రోజుల్లోనే పవన్ కల్యాణ్ ని పొలిటికల్ విజన్ తో చూపించడం జరిగిందన్నారు. ఇందులోని డైలాగ్స్ ఇప్పుడు ఎవరికి తగలాలో వారికి తగులుతాయని, ఈ సినిమా వల్ల పవన్ ఆలోచనలు తెలియాలన్నది మా ఆకాంక్ష అన్నారు. ఎన్నికల ముందు ఎన్నో పొలిటికల్ సినిమాలు వస్తాయని ఆయన అన్నారు. ఏపీలో రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పొత్తు అధికారాన్ని కైవసం చేసుకుంటుందని నట్టి కుమార్ పేర్కొన్నారు.