Vijay Devarakonda: రౌడీ హీరో సరసన బుట్టబొమ్మ.. ముద్దులకు ఈసారి హద్దులే లేవమ్మా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషీ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత వరుస లైనప్స్ పెట్టుకున్నాడు విజయ్.. గౌతమ్ తిన్ననూరి సినిమా ఒకటి.. గీత గోవిందం 2 ఒకటి లైన్లో ఉన్నాయి. డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వం వహించిన గీత గోవిందం సినిమా.. విజయ్ కెరీర్ లోనే గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటి. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మించాడు. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక నటించింది. ఇద్దరికీ ఈ చిత్రం మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇక గీతగోవిందం కాంబో మరోసారి రీపీట్ కానున్న విషయం తెల్సిందే.. ఈ మధ్యనే పరుశురామ్ తో తన సినిమా ఉంటుందని విజయ్ అధికారికంగా ప్రకటించాడు. అయితే ఈసారి గీతా ఆర్ట్స్ బదులు.. దిల్ రాజు రంగంలోకి దిగాడు. త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోనున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డేను తీసుకొనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. గీత గోవిందం లో విజయ్ కు, రష్మిక కు మధ్య ముద్దు సన్నివేశాలు గట్టిగానే ప్లాన్ చేశాడు పరుశురామ్. ఇక ఈ చిత్రంలో కూడా ఆ సీన్స్ బాగానే ఉంటాయని టాక్.
Adipurush: నిన్న అభిషేక్.. నేడు రణబీర్.. పదివేల టికెట్స్ ఫ్రీ
Also Read
- M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
- M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
- Censor: సినిమా రీ-ఎడిటింగ్‌కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
- Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
ఇక ఈ సినిమాతో లెక్కేసుకుంటే.. బుట్టబొమ్మ జాబితాలో స్టార్ హీరోల సినిమాలు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం గుంటూరు కారంలో మహేష్ సరసన నటిస్తోంది పూజా.. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ లో సైతం పూజాను ఓకే చేసినట్లు సమాచారం.. ఈ రెండు కాకుండా ఇప్పుడు విజయ్ సరసన నటించే లక్కీ ఛాన్స్ పట్టేసింది. నిజం చెప్పాలంటే గతేడాది నుంచి వరుస ప్లాప్స్ అందుకున్న హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇలా వరుస అవకాశాలను అందుకోవడం విడ్డురంగా ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..