RAM 23 : రామ్ పోతినేని సినిమా టైటిల్ ఇదే.. మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని కథానాయకుడిగా నటిస్తూ స్వయంగా దర్శకుడిగా వ్యవహరిస్తున్న చిత్రం ‘RAPO23’. నటుడిగానే కాకుండా మొదటిసారి మెగాఫోన్ పట్టి దశాబ్దాల కల నెరవేర్చుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలోనూ, అభిమానుల్లోనూ ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పాండిచ్చేరి తీర ప్రాంతంలో శరవేగంగా జరుగుతోంది.తాజా షెడ్యూల్లో భాగంగా చిత్రబృందం పాండిచ్చేరిలోని సుందరమైన ప్రదేశాలలో కీలక సన్నివేశాలతో పాటు ఒక కలర్‌ఫుల్ పాటను కూడా చిత్రీకరిస్తోంది. అలాగే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ కోసం కొన్ని పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్లను కూడా ఇక్కడే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి ఫిలిం నగర్ వర్గాల్లో ఒక క్రేజీ ప్రచారం సాగుతోంది. ఈ చిత్రానికి ‘ఏక – ద లోన్ వోల్ఫ్’ (EKA – The Lone Wolf) అనే పవర్ఫుల్ టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు జోరుగా టాక్ నడుస్తోంది. కథకు తగ్గట్టు సినిమాలో రామ్ పోతినేని పోషిస్తున్న ‘వీర’ పాత్ర తీరుతెన్నులకు ఈ టైటిల్ అత్యంత సరిగ్గా సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారు. రామ్ స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ చాలా ప్రత్యేకంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ టైటిల్ వార్తలపై మేకర్స్ నుండి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. జెట్ స్పీడ్ లో షూట్ చేస్తున్న ఈ సినిమాకు సామ్ CS సంగీతం అందిస్తున్నారు. వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న రామ్ ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Ramayana: ‘టాక్సిక్’ తర్వాత మరో భారీ పందెం.. 'రామాయణం'పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్!
- Akkineni Nagarjuna : 29న నాగార్జున 'కింగ్ 100' క్రేజీ గ్లింప్స్ బ్లాస్ట్.. అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ అప్డేట్
- The Paradise : ‘యెషనాగుల’ వచ్చేస్తోంది.. ‘ది ప్యారడైజ్’లో ఊరమాస్ ట్రీట్
- Toxic First Day Collection: ‘టాక్సిక్’ బాక్సాఫీస్ బ్లాస్ట్.. ఫస్ట్ డే రూ.150 కోట్లు
తాజావార్తలు
-
RAM 23 : రామ్ పోతినేని సినిమా టైటిల్ ఇదే.. మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందా?
-
Ramayana: ‘టాక్సిక్’ తర్వాత మరో భారీ పందెం.. ‘రామాయణం’పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్!
-
Akkineni Nagarjuna : 29న నాగార్జున ‘కింగ్ 100’ క్రేజీ గ్లింప్స్ బ్లాస్ట్.. అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ అప్డేట్
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!