బాలీవుడ్ లో బ్రేకప్ ల పరంపర ఎక్కువైపోతుంది. ఒక పక్క ఎంతో అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్న సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోతుంటే ఇంకోపక్క మరికొద్దిరోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు అనుకొనే ప్రేమజంటలు బ్రేకప్ చెప్పుకొని విడిపోవడం బాధాకరం. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీలు అనన్య పాండే, శ్రద్దా కపూర్ లవ్ స్టోరీలు బ్రేకప్ తో ముగిసినట్లు బీ టౌన్ లో వార్తలు గుప్పుమంటున్న వేళ మరో ముద్దుగుమ్మ బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పినట్లు సమాచారం. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు కియారా ఆద్వానీ.
బాలీవుడ్ లో కియారా లవ్ స్టోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కియారా గత కొన్నేళ్లుగా బాలీవుడ్ స్టార్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా తో ప్రేమాయణం నడుపుతున్న సంగతి తెలిసిందే. పబ్, ఎయిర్ పోర్ట్, ఫంక్షన్స్, ఈవెంట్స్ అని తేడా లేకుండా ఈ జంట చెట్టాపట్టాలేసుకొని కెమెరా కంటికి చిక్కారు.
ఇక సమ్మర్ వెకేషన్ లో మాల్దీవులకు కూడా వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చిన తరువాత ఈ జంట తమ రిలేషన్ పై ఓపెన్ అయ్యారు. మా జీవితాలు..మా బంధం సినిమా పరిశ్రమకి అతీతంగా ఉన్నాయి. ఆ కారణంగానే మా మనసులు కలిసాయి. ముందు కూడా ఒక్కటిగానే ప్రయాణించాలని అనుకుంటున్నాం అని చెప్పడంతో త్వరలోనే ఈ ప్రేమ పక్షులు పెళ్లితో ఒక్కటి అవుతారని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే బీ టౌన్ నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ అభిమానుల ఆశలను నిరాశ చేసింది. గత కొన్నిరోజుల నుంచి ప్రేమ జంట మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే కియారా, సిద్దార్థ్ కు బ్రేఅక్ప్ చెప్పిందని వార్తలు గుప్పుమంటున్నాయి.
కియారా ఎంతచెప్పినా బ్రేకప్ చెప్పేసిందని, సిద్దార్థ్ విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయం మార్చుకోమని చాలాసార్లు చెప్పినట్లు ఆమె సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. దీంతో అభిమానులు షాక్ కు గురవుతున్నారు. ఇకపోతే షేర్షా సినిమాలో ఈ జంట నటించిన తీరు ప్రతి ఒక్కరికి కంటతడిని పెట్టించింది. చాలామంది ఈ సినిమా చూసాకా సిద్దార్థ్- కియారా ఒక్కటి కావాలని కోరుకున్నారు అంటే అతిశయోక్తి కాదు. మరి ఈ పుకారు నిజమా.. కాదా..? అని తెలియాలంటే ఈ ప్రేమ జంట నోరు విప్పాల్సిందే.