మలయాళ సూపర్ స్టార్ హీరో మమ్ముట్టి లేటెస్ట్ మూవీ భ్రమయుగం.. మొదట మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 23న తెలుగులో రిలీజ్ అయింది. టాలీవుడ్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ మూవీని విడుదల చేసింది. రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ఈ సినిమాని చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ సంయుక్తంగా నిర్మించారు. అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు… ఈ సినిమా థియేటర్లలో విడుదలై ప్రభంజనాన్ని సృష్టించింది..
గతనెలలో విడుదలైన మలయాళ సినిమాలు అన్ని మంచి హిట్ ను అందుకున్నాయి.. అందులో మమ్ముట్టి నటించిన ‘భ్రమయుగం’ మూవీ అదిరిపోయిందని చెప్పొచ్చు. ఈ కాలంలోనూ బ్లాక్ అండ్ వైట్ కలర్‌లో సినిమాను తెరకేక్కించారు.. ఈ సినిమా కథ నచ్చడంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా ఇప్పుడు మూడు వారాలు తిరగముందే ఓటీటీలో వచ్చేస్తుంది.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సోని లైవ్ టీవీ భారీ ధరకు సొంతం చేసుకుంది..
ఈ సినిమా సోని లివ్ ఓటీటీలో మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేశారు… ఓ వీడియో రిలీజ్ చేసి అనౌన్స్ చేశారు.. అద్భుతమైన కథతో ఈ సినిమాను చాలా చక్కగా చూపించారు.. ఈ సినిమాను అక్కడ చూసి ఎంజాయ్ చెయ్యండి.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..
The iconic Mammootty stars in Bramayugam, a black and white masterpiece, shrouded in mystery and horror! Get ready for a cinematic experience unlike any other. Streaming on Sony LIV from March 15th.#Bramayugam #SonyLIV #BramayugamOnSonyLIV #Bramayugam starring @mammukka pic.twitter.com/os5y2t8hLH
— Sony LIV (@SonyLIV) March 6, 2024