Brahmanandam : ‘సైంటిస్ట్ వాలీ’గా బ్రహ్మానందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం కొంత గ్యాప్ తర్వాత తమిళ సినిమాల్లోకి ఎంట్రి ఇస్తున్నాడు. ఇంతకు ముందు చివరగా సంతానం నటించిన ‘దగల్టీ’లో నటించారు బ్రహ్మీ. ఆ సినిమా విడుదలైన కొద్ది రోజులకే లాక్‌డౌన్ ప్రకటించడంతో గుర్తింపుకు నోచుకోలేదు. ఇప్పుడు మరోసారి సంతానం సినిమాతో బ్రహ్మానందం తమిళంలో ఎంట్రీ ఇస్తున్నాడు. సంతానం నటిస్తున్న తాజా చిత్రానికి ‘కిక్’ అనే టైటిల్ పెట్టారు. దీని ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. త్వరలో విడుదల కానున్న ‘కిక్’లో బ్రహ్మానందం కీలక పాత్ర పోషించనున్నారు. ఈ మూవీలో బ్రహ్మానందం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఇందులో ఆయన సైంటిస్ట్ వాలి గా కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఆకట్టుకుంటున్నారు బ్రహ్మీ. ఇందులో తాన్యా హోప్ కథానాయిక. తంబిరామయ్య, సెంథిల్, రాగిణి ద్వివేది, కోవై సరళ, మన్సూర్ ఆలీఖాన్, మనోబాల, వైజి మహేంద్రన్, మొట్టై రాజేంద్రన్ ఇతర ముఖ్య పాత్రధారు. ఈ మూవీకి ప్రశాంత్ రాజ్ దర్శకత్వం వహిస్తుండగా అర్జున్ జన్య నిర్మిస్తున్నారు. గత రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్న సంతానం ఈ ‘కిక్’ మూవీతో కమ్‌బ్యాక్ అవుతాడని కోలీవుడ్ వర్గాలతోపాటు ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!