Brahmanandam: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఫేస్ కాదు.. ఆయన పేరు విన్నా కూడా పెదాల్లో చిరునవ్వు వస్తుంది. ఇప్పుడంటే వయసు మీద పడడంతో చాలా ప్రత్యేకమైన పాత్రలు చేసి మెప్పిస్తున్నాడు కానీ, ఒకానొక సమయంలో ఆయన లేని సినిమా ఉండేది కాదు అంటే అతిశయోక్తి లేదు. 67 ఏళ్ళు అయినా కూడా సినిమాను వదలకుండా.. చాలా సెలక్టీవ్ పాత్రలను ఒప్పుకుంటూ నటిస్తున్నాడు. ఇక బ్రహ్మీ సినిమాల్లోనే కాదు బయట కూడా అలాగే ఉంటాడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులే నవ్వులు. సెట్ లో, ఈవెంట్ లో.. ఎక్కడ ఉన్నా కూడా తనదైన మాటలతో నవ్వుస్తూ ఉంటాడు. ఇక ఆయనకు సెటైర్ వేస్తే.. రిటైర్ అయిపోవడమే. ఇలా చాలా సార్లు బ్రహ్మీ కౌంటర్లకు సెలబ్రిటీలే బలి అయ్యారు.
Vijay Setupathi: ట్రైన్.. మరో థ్రిల్లర్ తో వస్తున్న విజయ్ సేతుపతి
తాజాగా నేడు ఎలక్షన్స్ కావడంతో బ్రహ్మీ కుటుంబంతో సహా ఓటు వినియోగించుకోవడానికి వచ్చాడు. ఓటు వేసిన తరువాత రిపోర్టర్ ఒక తలతిక్క ప్రశ్న అడగడం.. దానికి బ్రహ్మీ తనదైన రీతిలో సమాధానం చెప్పడం జరిగింది. ఒక రిపోర్టర్ వచ్చి.. ఓటు హక్కు ఉండి కూడా వినియోగించుకోలేనివాళ్లను ఏమంటారు? అండీ అని అడగగా వెంటనే బ్రహ్మీ.. ” ఏముంటామండీ.. ఓటు హక్కును వినియోగించుకోలేని వాళ్లు అంటారు”అని చెప్పుకొచ్చాడు. దీంతో అక్కడ నవ్వులు పూశాయి. సడెన్ గా బ్రహ్మీ అలా అనడంతో అక్కడ ఉన్నవారందరూ కూడా షాక్ అయ్యారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.