Game Changer: అసలైన గేమ్ చేంజర్ దిగాడు.. ఇక జరగండి జరగండి జరగండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brahmanandam Cameo in Ram Charan Game Changer: ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ ఇమేజ్‌తో చరణ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. శంకర్ మార్క్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. ఓల్డ్ లుక్‌లో పొలిటిషియన్‌గా, యంగ్ లుక్‌లో కలెక్టర్‌గా కనిపించనున్నాడని టాక్ అయితే ఉంది. ఇప్పటికే లీక్ అయిన చరణ్ లుక్స్ మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉందని చెప్పక తప్పదు. అయితే ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందనే విషయంలో క్లారిటీ లేదు. ఈ సినిమాను సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నిర్మిస్తున్న దిల్ రాజు వెల్లడించారు.
Bandla Ganesh: బండ్ల గణేష్ కారు డ్రైవర్ భార్య ఆత్మహత్య..
Also Read
- Venkata Satish Kilaru: 60% మేకింగ్.. 40% రెమ్యూనరేషన్.. రామ్ చరణ్ 'పెద్ది' సినిమా బడ్జెట్ లెక్కలివే!
- Vijay Deverakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. రష్మికతో కలిసి సొంత ఊరిలో 180 మంది విద్యార్థులకు ‘పెళ్లి కానుక’!
- Ram Charan: ఈ కాంబో సెట్ అయితే థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. రామ్ చరణ్ - శ్రీకాంత్ ఓదెల మూవీపై క్రేజీ బజ్!
- Buchi Babu: అచ్చియమ్మ క్యారెక్టర్ రేంజ్ ఏంటో బుధవారం చూస్తారు.. జాన్వీ కపూర్ రోల్‌పై డైరెక్టర్ బుచ్చిబాబు షాకింగ్ కామెంట్స్!
ఇక ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో బ్రహ్మానందం ఒక అతిథి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. అంతకుముందు శంకర్ సినిమాలో ఒకసారి బ్రహ్మానందం నటించారు. ఇది శంకర్ డైరెక్షన్లో బ్రహ్మానందం కనిపించడం రెండో సారి. వయసు పైబడిన నేపద్యంలో బ్రహ్మానందం ఇప్పుడు పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. చాలా సెలెక్టివ్ గా ఒకటి అరా సినిమాలు మాత్రమే చేస్తున్నారు. ఆయన పూర్తిస్థాయిలో కనిపించిన కీడా కోలా ఈ మధ్యనే విడుదలైంది. ఇటీవల విడుదలైన సుమ కొడుకు రోషన్ బబుల్ గం సినిమాలో కేవలం ఒక సీన్ కి మాత్రమే ఆయన పరిమితమయ్యారు. ఇక ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ సినిమాలో ఆయన అతిథి పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో ఈ రోజు షూటింగ్లో కూడా జాయిన్ అయినట్టు తెలుస్తోంది. రేపు కూడా ఆయన షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లుగా చెబుతున్నారు.
తాజావార్తలు
-
Venkata Satish Kilaru: 60% మేకింగ్.. 40% రెమ్యూనరేషన్.. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా బడ్జెట్ లెక్కలివే!
-
INDW Vs PAKW: రీచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్.. పాకిస్థాన్ ముందు భారత్ టార్గెట్ ఎంతంటే..
-
Harmanpreet Kaur: రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్.. దేశ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా..
-
NEET UG 2026: నీట్ రాసే విద్యార్థులకు అలర్ట్.. అడ్మిట్ కార్డులు వచ్చేశాయి! ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
-
Bhatti Vikramarka : చరిత్రను, భవిష్యత్తును గుండెకు హత్తుకున్న నగరం హైదరాబాద్
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్‌తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!