Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri City Boiler Blast: తిరుపతి: శ్రీసిటీలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సత్యవేడు మండలం శ్రీ సిటీ పరిధిలోని టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందారు.. నైట్ షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్న పలువురు కార్మికులు పేలుడు ధాటికి చిక్కుకున్నట్లు తెలుస్తోంది. బాయిలర్ పేలుడుతో పరిశ్రమలో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు వెంటనే పరిశ్రమ వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడులో మరికొందరు కార్మికులు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన పరిశ్రమలో అధికారులు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. పేలుడుకు గల కారణాలు ఏమిటన్న దానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. బాయిలర్ పేలుడుకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీసిటీలోని ప్రైవేట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి కార్మికులు మృతి చెందడం, మరికొందరు గాయపడటం తీరని విషాదమని పేర్కొన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు నారా లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Also Read
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
- Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
- Bhumana Karunakar Reddy: తప్పుడు ప్రచారంపై భూమన ఫైర్.. ఇందుకేనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు జీతాలు..?
తాజావార్తలు
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!