India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: ఏషియన్ గేమ్స్ 2026 క్రికెట్ ఫైనల్లో మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. శనివారం (అక్టోబర్ 3) జరిగిన ఈ గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడగా.. టాస్ పడిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదు. గత కొంతకాలంగా ఆసియా కప్ నుంచి ఐసీసీ టోర్నీల వరకు భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌లలో చూస్తున్న ఈ ‘నో-హ్యాండ్ షేక్’ ధోరణి ఇప్పుడు ఏషియన్ గేమ్స్‌లోని అత్యంత కీలకమైన పసిడి పోరులోనూ కొనసాగడం గమనార్హం. సెమీఫైనల్లో శ్రీలంకపై 124 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి భారత్ ఫైనల్‌కి దూసుకొస్తే, బంగ్లాదేశ్‌ను ఓడించి పాకిస్థాన్ తుది సమరానికి అర్హత సాధించింది. ఇక గోల్డ్ మెడల్ కోస జరుగుతున్న ఈ మహా సంగ్రామంలో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే టాస్ సమయంలో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, పాకిస్థాన్ కెప్టెన్ సాహిబ్జాదా ఫర్హాన్ల మధ్య కాస్త దూరంగా నుంచే కొన్ని మాటలు నడిచాయి తప్ప, ఇద్దరూ దగ్గరకు వచ్చి హ్యాండ్‌షేక్ మాత్రం చేసుకోలేదు. ఒకరికొకరు దూరంగానే ఉంటూ తమ వైఖరిని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌ను టీమిండియా కరివేపాకులా తీసి పారేసిందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.
ఇక ఈ టోర్నీలో ఇతర క్రీడల విషయానికి వస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. ఏషియన్ గేమ్స్‌లోని టేబుల్ టెన్నిస్ మ్యాచ్‌లలో భారత్, పాకిస్థాన్ ఆటగాళ్లు మ్యాచ్ ముగిసాక ఎంతో సాధారణంగా చేతులు కలిపారు. ఈవెన్ హాకీ సెమీఫైనల్లో కూడా ఇరు జట్ల ప్లేయర్లు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ మైదానంలో ఆత్మీయంగా పలకరించుకున్న ఫోటోలు బయటకొచ్చాయి. కానీ, క్రికెట్‌కు వచ్చేసరికి మాత్రం ఈ నో-హ్యాండ్ షేక్ సంప్రదాయం కొనసాగుతుండటం గమనార్హం. నిజానికి ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) కానీ, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) కానీ ఆటగాళ్లు ఖచ్చితంగా చేతులు కలపాలని ఎలాంటి నిబంధనా పెట్టలేదు. కాకపోతే క్రీడాస్ఫూర్తికి, ఆటగాళ్ల మధ్య ఉండే స్నేహపూర్వక వాతావరణానికి సంకేతంగా ఇది ఒక ఆనవాయితీగా వస్తోంది. మరోవైపు ఏషియన్ గేమ్స్ నుంచి వచ్చిన ఒక ఆసక్తికరమైన చిత్రం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతకుముందు జరిగిన మహిళల క్రికెట్ విభాగంలో భారత మహిళల జట్టు గోల్డ్ మెడల్ సాధించగా, పాకిస్థాన్ జట్టు బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. ఈ టోర్నీలో మహిళల విభాగంలో భారత్-పాక్ ముఖాముఖి తలపడకపోయినా, ప్రెజెంటేషన్ సమయంలో రెండు జట్ల క్రీడాకారిణులు ఒకే పోడియంపై కలిసి కనిపించారు. కానీ ఇప్పుడు పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ మ్యాచ్ టాస్ సమయానికి వచ్చేసరికి భారత్-పాకిస్థాన్ క్రికెట్ మధ్య నడుస్తున్న ఈ ‘నో-హ్యాండ్ షేక్’ అధ్యాయం ఏషియన్ గేమ్స్ వేదికగా మరోసారి హైలైట్ అయింది.
Also Read
- India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
- Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
తాజావార్తలు
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!