Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajamouli: సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై రోజురోజుకూ ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో మహేష్ బాబు యాక్టింగ్, రుద్ర పాత్రలో ఆయన పలికించిన భావోద్వేగాలపై జక్కన్న స్వయంగా చేసిన కామెంట్స్ సూపర్ స్టార్ట్ అభిమానులతో పాటు సినిమా ప్రేక్షకుల్లో వారణాసిపై విశేష ఆసక్తిని తెప్పిస్తున్నాయి. షూటింగ్ స్టార్టింగ్‌కి ముందు మహేష్ నుంచి బెస్ట్ అవుట్‌పుట్ ఎలా రాబట్టాలా అని ఆలోచించానని, కానీ ఒకసారి సెట్లోకి అడుగుపెట్టాక ఆయన యాక్టింగ్ చూసి తానే ఆశ్చర్యపోయాని జక్కన్న వెల్లడించారు. తాను వంద శాతం ఆశిస్తే, మహేష్ ఏకంగా రెండొందల శాతం ఎఫర్ట్ పెట్టి సర్ప్రైజ్ చేశారని ప్రశంసల వర్షం కురిపించారు.
అమెరికాలోని ప్రతిష్టాత్మక పెన్‌స్టేట్ యూనివర్సిటీ ఫిల్మ్‌స్కూల్ విద్యార్థులతో ముచ్చటించిన సందర్భంగా రాజమౌళి ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కాస్టింగ్ విషయంలో తాను ఏనాడూ స్టార్‌డమ్‌ను చూసి నిర్ణయం తీసుకోనని, కేవలం కథ డిమాండ్ చేసే నటులనే ఎంచుకుంటానని స్పష్టం చేశారు. ‘రుద్ర’ పాత్ర కోసం మహేష్ బాబు చూపించిన అంకితభావం మాటల్లో చెప్పలేనిదని, ఆ పాత్రలో ఆయన యాక్టింగ్ చూశాక ఒక డైరెక్టర్‌గా తనకు గొప్ప అనుభూతి కలిగిందని పేర్కొన్నారు. కేవలం నటించడం మాత్రమే కాదు, రుద్రగా మహేష్ తెరపై జీవించేశారని కొనియాడారు. యాక్షన్ అడ్వెంచర్ జానర్లో మునుపెన్నడూ చూడని సరికొత్త ప్రపంచాన్ని ఈ సినిమాతో రాజమౌళి ఆవిష్కరిస్తున్నారు. వారణాసి నేపథ్యంలో సినిమా స్టార్ట్ అయ్యి అంటార్కిటికా మంచు ఖండాలు, ఆఫ్రికా అడవులు, అలాగే పురాతన రోమ్ సామ్రాజ్యం వరకు విభిన్న కాలాలు, భిన్నమైన భౌగోళిక ప్రాంతాల చుట్టూ ఈ సాహస ప్రయాణం సాగనుందని ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ విజువల్ వండర్, వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
Also Read
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
తాజావార్తలు
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!