Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varalaxmi Sarathkumar: పెళ్లయిన వెంటనే “శుభవార్త ఎప్పుడు?” అంటూ సమాజం సంధించే ప్రశ్నలపై నటి వరలక్ష్మి శరత్‌కుమార్ నిర్మొహమాటంగా స్పందించారు. భవిష్యత్తులో తాను పిల్లలను కనకూడదని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేస్తూ, అందుకు గల బలమైన కారణాలను పంచుకున్నారు. 2024లో ముంబైకి చెందిన ప్రముఖ ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్ను పెళ్లాడిన వరలక్ష్మి, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం, కుటుంబ ప్రణాళికలపై మనసు విప్పారు. “నాకు పిల్లలు పుట్టరని కాదు.. పిల్లలు వద్దన్నది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. దీనిపై నాకు స్పష్టమైన ఆలోచన ఉంది. ఈ విషయంలో నా భర్త పూర్తి సపోర్ట్ నాకుంది. ఆయన ఆలోచన కూడా ఇదే” అంటూ సమాజం వేసే ప్రశ్నలకు సూటిగా సమాధానమిచ్చారు.
కేవలం పిల్లలను కనడమే పేరెంటింగ్ కాదని, ఒక ప్రాణాన్ని లోకంలోకి తెచ్చి సరైన బాధ్యతతో పెంచగలమా లేదా అన్నది గుర్తించడమే నిజమైన పేరెంటింగ్ అని ఆమె తేల్చిచెప్పారు. ఆ బాధ్యతలను మోసేందుకు రెడీగా లేనప్పుడు పిల్లల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమమైన నిర్ణయమని వరలక్ష్మి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే నికోలాయ్ మొదటి వివాహం ద్వారా ఉన్న కుమార్తెను తాను సొంత బిడ్డలాగే చూసుకుంటున్నానని, అలాగే ఇంట్లో ఉన్న రెండు పెంపుడు కుక్కలను కూడా పిల్లల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని ఆమె తెలిపారు. ఒక స్టార్ నటిగా ఇలాంటి సున్నితమైన అంశంపై ఏమాత్రం తటపటాయించకుండా నిర్భయంగా మాట్లాడటం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనూ, నెట్టింటా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
Also Read
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
తాజావార్తలు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!