Brahmamudi Actress Nainisha Rai struggles in starting days: తెలుగులో బ్రహ్మముడి సీరియల్ తో గుర్తింపు తెచ్చుకుంది నటి నైమిషా రాయ్. బ్రహ్మముడి సీరియల్ లో హీరోయిన్ చెల్లెలు అప్పు పాత్రలో నటిస్తోంది నైనిషా రాయ్. ఈ బెంగాలీ భామ పలు సీరియల్స్ లో భిన్నమైన రోల్స్ చేసింది. వంటలక్క సీరియల్ లో ఆమె నెగటివ్ రోల్ చేయగా కొంచెం ఇష్టం కొంచెం కష్టం, భాగ్య రేఖ, ఇంటిగుట్టు, హంసగీతం సీరియల్స్ లో కీలక పాత్రలు చేసింది. ఈటీవీలో ప్రసారమైన శ్రీమంతుడు సీరియల్ లో లీడ్ రోల్ కూడా చేసింది. ఒకటి రెండు సినిమాల్లో కూడా ఆమె నటించారు. అయితే నటిగా ఎదిగే క్రమంలో ఆమె అనేక కష్టాలు పడ్డానని చెప్పుకొచ్చింది. నైనిష తండ్రి లెక్చరర్ కావడంతో యాక్ట్రెస్ అవుతానంటే ఒప్పుకోలేదట.
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబుతో చర్చకు రెడీ.. సీఎం అవసరంలేదు.. మా నేతలు చాలు..!
దాంతో ఆమె పేరెంట్స్ ఆమెను బయటకు పొమ్మన్నారట. అయితే నటన మీద ఇష్టంతో తల్లిదండ్రులతో విభేదించిన నైమిషా రాయ్ బయటకు వచ్చేసి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందట. క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఎన్నో అవకాశాలు వదులుకుని ఆకలి తీర్చుకోవడానికి డబ్బులు ఇస్తారని తెలిసి బ్లడ్ డొనేట్ చేసిందట. కొన్ని సందర్భాల్లో తినడానికి తిండి లేక ఇబ్బంది పడ్డానని కడుపు నింపుకోవడానికి బ్లడ్ డొనేషన్ చేశానని చెప్పుకొచ్చింది. నటిగా ఆఫర్ అడిగితే నా కేంటి? అని అడిగేవారు, కొందరు ఆఫర్ ఇచ్చాక కమిట్మెంట్ అడగటం మొదలు పెట్టారు. షూటింగ్ మొదలవుతుందనగా బలవంతం చేస్తే కొట్టి తప్పించుకుని వచ్చేశానని ఆమె చెప్పుకొచ్చింది. ఆఫర్స్ రాక తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటే పేరెంట్స్ ఆదరిస్టారో లేదో తెలియక చనిపోవడం మంచిదని పలుమార్లు సూసైడ్ అటెంప్ట్ చేశానని ఆమె పేర్కొంది. అయితే ఎట్టకేలకు ఆత్మవిశ్వాసంతో కష్ట నష్టాలు ఎదుర్కొని ఈ స్థాయిలో ఉన్నానని నైనిషా చెప్పుకొచ్చింది.