Vishwak Sen Clarity about Arjun Sarja Issue: 2022 చివర్లో సీనియర్ హీరో అర్జున్ సర్జా తను నిర్మిస్తూ దర్శకత్వం వహించనున్న చిత్రం నుండి హీరో విశ్వక్ సేన్ ని తొలిగించినట్లు మీడియా ద్వారా ప్రకటించారు. దీనికి సంబంధించి అనేక చర్చలు జరిగాయి. విశ్వక్ సిన్సియారిటీని ప్రశ్నిస్తూ వృత్తి పట్ల విశ్వక్ కి డెడికేషన్ లేదని చెప్పాడు. ఆ తర్వాత స్క్రిప్ట్ లో తాను సూచించిన మార్పులు దర్శకుడు అంగీకరించడానికి సిద్ధంగా లేనప్పుడు తాను పని చేయలేనని విశ్వక్ చెబుతూ అర్జున్ కి క్షమాపణ కూడా చెప్పాడు. అయితే ఈ వివాదం ముగిసి చాలా కాలం అయింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం మీద విశ్వక్ స్పందించాడు. నేను ఒక్క రోజు షూటింగ్ వాయిదా వేయమన్నా, సినిమా చేయనని చెప్పలేదు.
Pawan Kalyan: పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై క్లారిటీ.. అక్కడి నుంచే..!
దానికే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా మాటలు అనేశారని విశ్వక్ చెప్పుకొచ్చాడు. నేను బాక్గ్రౌండ్ ఉన్న హీరోనయితే అలా చేసేవారా? అని ప్రశ్నించిన విశ్వక్ తాను తీసుకున్న పారితోషికం కూడా రెట్టింపు వేసి తిరిగిచ్చేశా అని సీనియర్ యాక్టర్ అర్జున్ తో విభేదాలపై విశ్వక్ సేన్ స్పందించాడు. నిజానికి సినిమా నుంచి వెళ్లిపోయాడని అర్జున్ చెబుతుంటే నాకు గౌరవం లేని చోట మనసు చంపుకొని పనిచేయలేనని అందుకే బయటకు వచ్చానని విశ్వక్ అప్పట్లో చెప్పుకొచ్చారు. నిజానికి విశ్వక్ సేన్ ఈ సినిమా అగ్రిమెంట్ చేసుకున్నప్పుడే రెమ్యూనిరేషన్ వద్దని, దాని ప్లేస్ లో నైజాం షేర్స్ ఇవ్వమని అడగగా అలాగే ఒప్పందం కూడా కుదిరిందట. ఇక అందుకు తగ్గట్టుగానే విశ్వక్ కు ముందే రూ. 50 లక్షల వరకు ఇచ్చారని కూడా టాక్ నడిచింది.