BoyapatiSuriya: బోయపాటి శ్రీను లాంటి మాస్ డైరెక్టర్ చేతిలో ఒక క్లాస్ హీరో పడితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు క్లాస్ గా ఉన్న హీరోలను మాస్ గా మార్చిన డైరెక్టర్స్ లో బోయపాటి ఒకడు. ఇక ప్రస్తుతం బోయపాటి..రామ్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఇస్మార్ట్ శంకర్ రామ్ చేసిన మాస్ క్యారెక్టర్ ఒక ఎత్తు అయితే.. ఈ సినిమాలో బోయపాటి చూపించే మాస్ క్యారెక్టర్ మరో ఎత్తు అని చెప్పొచ్చు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే రిలీజైన రామ్ ఊర మాస్ లుక్ ఎంతటి హైప్ ను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Ustaad Bhagat Singh: హరీష్ అన్నా.. నువ్వు కూడా పూజా పాపను తీసేశావా..?
ఇకపోతే ఈ సినిమా తరువాత బోయపాటి.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. సూర్య మాస్ యాక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే సూర్య.. విక్రమ్ లో చేసిన రోలెక్స్ పాత్రలో విలన్ గా నట విశ్వరూపం చూపించాడు. ఇక బోయపాటితో కనుక సూర్య కలిస్తే రక్తచరిత్రనే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ప్రస్తుతం సూర్య.. కంగువ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా కాకుండా మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.