Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల నటిస్తున్న విషయం తెల్సిందే. తమిళ్ లో హిట్ అయిన తేరికి ఈ సినిమా అధికారిక రిమేక్. అయితే కేవలం ఆ సినిమా లైన్ మాత్రమే తీసుకొని తనకు నచ్చిన విధంగా హరీష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన గ్లింప్స్, పవన్ పోస్టర్స్ ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుందని వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పూజా ఈ చిత్రంలో నటించడం లేదట. ఇందులో కూడా శ్రీలీల మెయిన్ లీడ్ చేస్తుండగా.. సెకండ్ హీరోయిన్ గా ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్యను తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. దీంతో అభిమానులు హరీష్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Comedian Venkatesh: మరో మహిళతో ఎఫైర్.. వెంకటేష్ కాళ్లు విరగొట్టించిన భార్య..?
పవన్ సరసన వాళ్లిద్దరూ చాలా చిన్న వయస్సు ఉన్నట్లు కనిపిస్తారు. కనీసం పవన్ భార్యగా ఒక స్టార్ హీరోయిన్ ను అయినా తీసుకోండి అంటూ చెప్పుకొస్తున్నారు. ఇకపోతే పూజాను గుంటూరు కారం నుంచి మేకర్స్ తొలగించిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఇందులో కూడా అవుట్ అనగానే.. హరీష్ అన్నా.. నువ్వు కూడా పూజా పాపను తీసేశావా..? అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇంకోపక్క పూజాను అయినా భరిస్తాం కానీ ఈ హీరోయిన్ వద్దు అని చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో ఏది నిజం తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించేవరకు ఆగాల్సిందే.