దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం ‘అఖండ’ సినిమా పూర్తిచేసే పనిలో పడ్డాడు. త్వరలోనే షూటింగ్ మొదలెట్టి ప్యాకప్ చెప్పేయనున్నాడు. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్ సినిమాల తరువాత వస్తున్న కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక అఖండ టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా తరువాత బోయపాటి చేయబోయే చిత్రంపై రకరకాల పేర్లు వినిపించాయి. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాల్సి ఉండగా.. బన్నీ మిగితా ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో బోయపాటి రూటు మార్చుకున్నాడు. తాజా సమాచారం మేరకు తమిళ స్టార్ హీరో సూర్యతో బోయపాటి సినిమా చేయనున్నాడట. రీసెంట్ గా సూర్యకు కథ వినిపించినట్లుగా.. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగాను ప్రచారం జరుగుతోంది. ఇది స్ట్రైయిట్ తెలుగు సినిమా కానుండగా.. తమిళంలోను రిలీజ్ చేయనున్నారట. మరోవైపు సూర్య కూడా బన్నీ వలె మిగితా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. మరి వీరి కాంబినేషన్ వస్తుందనడానికి బలమైన కారణాలు ఏవి కూడా లేకపోవడంతో అధికారిక ప్రకటన వచ్చేదాకా ఆగాల్సిందే!