అక్టోబర్ 19న టాలీవుడ్ లో బాలయ్య, రవితేజల మధ్య బాక్సాఫీస్ వార్ జరగనుంది. పాన్ ఇండియా లెవల్లో చూస్తే రవితేజ-శివ రాజ్ కుమార్-దళపతి విజయ్-టైగర్ ష్రాఫ్ మధ్య ఫైట్ జరగనుంది. ముఖ్యంగా ఈ ఫైట్ టైగర్ vs టైగర్ గా జరగనుంది అంటే టైగర్ నాగేశ్వరరావు vs టైగర్ ష్రాఫ్ కి ఇంటెన్స్ బాక్సాఫీస్ ఫైట్ జరగనుంది. హిందీలో సాలిడ్ పొటెన్షియల్ ఉన్న ప్రొడక్షన్ హౌజ్ గా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కి పేరుంది, రవితేజకి కూడా నార్త్ బెల్ట్ లో మంచి పేరుంది. అందుకే టైగర్ నాగేశ్వర రావు సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ పాన్ ఇండియా హిట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. ఆ అంచనాలని పెంచుతూ మేకర్స్ ఎప్పటికప్పుడు సూపర్బ్ ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేస్తూనే ఉన్నారు.
టైగర్ నాగేశ్వర రావు రిలీజ్ అయ్యే రోజునే హిందీలో టైగర్ ష్రాఫ్ మూవీ గణపత్ రిలీజ్ అవుతోంది. బిగ్ బి అమితాబ్ కీ రోల్ ప్లే చేసిన ఈ సినిమా హిట్ అవుతుందని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. సో నార్త్ లో ఈ దసరాకి టైగర్ నాగేశ్వర రావు vs టైగర్ ష్రాఫ్ వార్ కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పుడు ఈ వార్ కేవలం టైగర్ vs టైగర్ మాత్రమే కాదు సనన్ vs సనన్ గా కూడా మారింది. గణపత్ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. టైగర్ నాగేశ్వర రావు సినిమాలో నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. కృతి సనన్ చెల్లెలైన నుపుర్ సనన్ నటిస్తున్న మొదటి సినిమా టైగర్ నాగేశ్వర రావు. అక్టోబర్ 19న కృతి సనన్ vs నుపుర్ సనన్ వార్ లో ఎవరు గెలుస్తారు అనేది చూడాలి. ఈ విషయంలో నుపుర్ సనన్ చాలా ఎగ్జైటింగ్ గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.