Boney Kapoor: శ్రీదేవిని పెళ్లి చేసుకోవడానికి అర్జున్ తల్లిని వదిలేశా.. కానీ ఆమె బంగారం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boney Kapoor Says He Understood Arjun Kapoor’s Anger After Marriage With Sridevi: ఒకప్పుడు బోనీకపూర్ బాలీవుడ్‌లో నంబర్ వన్ నిర్మాత. దివంగత నటి శ్రీదేవితో అతని ప్రేమ, వివాహం ఒకప్పుడు ఎంతో సంచలననం కలిగించిన అంశాలు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీదేవి మరణంతో కుంగిపోయిన బోనీకపూర్ కనీసం ఒక్క ఇంటర్వ్యూలో కూడా తన భార్య గురించి మాట్లాడకుండా ఉండలేడు. బోనీ కపూర్ నిర్మించిన కొత్త చిత్రం మైదాన్‌ను ప్రమోట్ చేస్తున్న క్రమంలో శ్రీదేవితో తన వివాహం గురించి , తన మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్ కోపం గురించి మాట్లాడారు. బోనీ కపూర్ 1983లో మోనా శౌరీని వివాహం చేసుకున్నారు. ఈ జంట పదమూడు సంవత్సరాలు కలిసి జీవించారు. ఆ క్రమంలోనే వారి ప్రేమకు గుర్తుగా పుట్టిన పిల్లలు అర్జున్ కపూర్, అన్షులా కపూర్. అయితే 1996లో బోనీకపూర్ శ్రీదేవిని పెళ్లాడేందుకు మోనా శౌరీని విడిచిపెట్టారు. అయితే తన ఈ నిర్ణయం తన కొడుకు అర్జున్ కపూర్ భావోద్వేగాలను బాగా ప్రభావితం చేసిందని బోనీ కపూర్ చెప్పారు.
Film Chamber: హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో అగ్నిప్రమాదం
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
తన కొడుకు చాలా సంవత్సరాలుగా తనపై కోపంగా ఉన్నాడని కూడా బోనీ కపూర్ వెల్లడించాడు. నేను అతని భావోద్వేగాలను అర్థం చేసుకోగలను, అవి ఎందుకు, ఎక్కడ నుండి వస్తున్నాయో తెలుసుకోగలనని అనాన్రు. చాలా కాలంగా నేను దాని గురించి గిల్టీగా భావించాను. కానీ నాకు చాలా నిజాయితీగా సపోర్ట్ చేసింది మోనా శౌరీ. శ్రీదేవి పట్ల నాకున్న ఫీలింగ్స్‌ని మోనా ఒక్కరే అర్థం చేసుకుంటారని బోనీకపూర్ అన్నారు. మోనాకి శ్రీతో మంచి స్నేహం ఉండేది, మా పెళ్లికి ముందు, శ్రీదేవిని ఆమె ఇంటికి పిలిచేది, శ్రీదేవి మా ఇంట్లోనే ఉండేది. మా అమ్మ కూడా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుందని అన్నారు. శ్రీదేవిని నా చేతికి రాఖీ కట్టమని ఒకసారి అడిగానని బోనీకపూర్ గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఐదేళ్లలోపే పెళ్లి జరిగిందని అన్నారు. ఇక శ్రీదేవి 2018లో మరణించారు. ఆ మరణం గురించి ఇంకా మాట్లాడలేనని బోనీ చెప్పారు. ఆమె లేకుండా ఎలా జీవించాలో నాకు తెలియదు అని బోనీ కపూర్ అన్నారు.
తాజావార్తలు
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
-
Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
-
Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
-
DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?