1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1980s Photo: సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్రెండ్స్ వస్తూనే ఉంటాయి. అయితే ఈసారి నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నది మాత్రం ఒక డిఫరెంట్ ఫొటో ట్రెండ్. అదే ‘1980ల నాటి ఏఐ ఫొటో ట్రెండ్’. మన తాతయ్యలు, అమ్మమ్మల కాలం నాటి ఆనాటి వింటేజ్ లుక్‌లోకి ఇప్పుడున్న యూత్ మారిపోతున్నారు. అలనాటి హెయిర్‌స్టైల్స్, మెరిసిపోయే రంగురంగుల దుస్తులు, సాఫ్ట్ లైటింగ్, పాతకాలపు ఫిల్మ్ కెమెరా టెక్స్చర్తో కూడిన ఫొటోలతో సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. సాధారణ వింటేజ్ ఫిల్టర్లు కేవలం రంగులను మాత్రమే మారుస్తాయి. కానీ, ఈ ఏఐ ట్రెండ్ ప్రత్యేకత ఏమిటంటే.. మన అసలు ముఖరూపం మారకుండానే దుస్తులు, హెయిర్‌స్టైల్, ఆభరణాలు, బ్యాక్‌గ్రౌండ్, లైటింగ్‌లను నాటి కాలానికి తగినట్లుగా సంపూర్ణంగా మార్చేస్తుంది. ఈ వింటేజ్ ట్రెండ్‌లో ఫొటోలను ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
మీ దగ్గరున్న ఒక మంచి ఫొటోను ఛాట్‌జీపీటీ (ChatGPT)కి అప్లోడ్ చేసి, దాన్ని 1980ల నాటి ఫొటోలా మార్చమని కోరితే చాలు. ఇందులో బాలీవుడ్ స్టూడియో పోర్ట్రెయిట్, ఇండియన్ ఫ్యామిలీ ఫొటో, కాలేజ్ గ్రాడ్యుయేషన్ పిక్, లేదా గ్లామరస్ మోడలింగ్ షూట్.. ఇలా మీకు నచ్చిన శైలిని ఎంచుకోవచ్చు. అయితే ఈ మార్పు సరైన రీతిలో రావాలంటే ఛాట్‌జీపీటీకి ఇచ్చే ప్రాంప్ట్ చాలా స్పష్టంగా ఉండాలి. మీ ఫేస్ కట్, చర్మ ఛాయ, ముఖ లక్షణాలు మారకుండా ఉంచుతూనే.. బట్టలు, హెయిర్‌స్టైల్, లైటింగ్, అనలాగ్ ఫిల్మ్ గ్రైన్ ఎలా ఉండాలో వివరించాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా మీ మొబైల్లో ఛాట్‌జీపీటీ ఓపెన్ చేసి, కొత్త చాట్ ప్రారంభించి ప్లస్ (+) బటన్‌పై క్లిక్ చేసి మీ ఫొటోను అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత 80ల నాటి శైలిలో ఫొటోను రీక్రియేట్ చేయమని కోరుతూ మీ అభిరుచికి తగ్గ వివరాలను అందివ్వాలి. ఒకవేళ మొదటి ప్రయత్నంలో వచ్చిన అవుట్‌పుట్ మీకు పూర్తి సంతృప్తిని ఇవ్వకపోతే, ప్రాంప్ట్‌ను మళ్లీ సరిచేసి హెయిర్‌స్టైల్, లైటింగ్ లేదా ఫిల్మ్ గ్రాన్యులారిటీలో మార్పులు చేయమని అడగొచ్చు. కొన్ని ఫొటో ప్రాంప్ట్స్ ఇంగ్లీష్‌లో మీకోసం కింద ఇచ్చాం. వాటిని ట్రై చేయండి.
Also Read
- Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
- Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
- రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
- IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
1. 1980s Fashion Magazine
Transform the uploaded photo into an editorial fashion portrait inspired by Indian fashion magazines from the mid-1980s. Preserve my facial features and identity exactly. Use bold, period-accurate 1980s clothing, hairstyle and accessories, with professional studio lighting and a sophisticated backdrop. Recreate the appearance of a scanned film photograph with natural grain, soft highlights and slightly faded colours. Keep the styling authentic to the 1980s and make it look like a genuine period photograph, not a modern photograph with a vintage filter.
2. Retro Bollywood Studio Portrait
Transform the uploaded photo into a realistic Indian studio portrait from the late 1980s. Keep my face, facial structure, skin tone and identity clearly recognisable. Give me authentic 1980s Indian fashion, a period-accurate hairstyle and understated jewellery. Use soft studio lighting, a classic portrait backdrop and the composition typical of old Bollywood photographs. Add natural analogue film grain, mild colour fading and realistic film texture. Make it look like an actual photograph taken on a film camera in India during the 1980s, rather than a modern photo with a vintage filter.
3. Glamorous 1980s Portrait
Transform the uploaded photo into a glamorous professional portrait from the 1980s. Keep my face and identity intact while giving me an era-appropriate hairstyle, makeup, clothing and accessories. Use dramatic studio lighting and a classic portrait backdrop, with the soft, slightly dreamy appearance of an analogue film photograph. Add fine film grain and subtle colour imperfections while keeping the result realistic and believable.
4. 1980s Indian Family Photograph
Recreate the uploaded photo as a genuine family photograph taken in an Indian home around 1985. Preserve my identity and natural facial features. Change the clothing and hairstyle to match the period and place me in a simple, authentic 1980s Indian interior. Use realistic flash photography, slightly soft focus, muted analogue colours and subtle grain. Make it feel like a photograph from an old family album. Avoid exaggerated retro effects, sepia tones and artificial scratches.
5. 1980s College Photo
Recreate the uploaded photo as an authentic Indian college portrait from the early 1980s. Preserve my facial identity and natural skin tone. Give me period-correct clothes, hairstyle and accessories, with a simple campus or studio background. Use realistic analogue photography, slightly warm colours, soft focus and subtle film grain. Make it look like a genuine photograph from an Indian college album of the early 1980s.
తాజావార్తలు
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
AP Rain Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఏపీకి విపత్తుల సంస్థ హెచ్చరిక
-
Tilak Varma: టీమిండియాలో ఆడుతున్నా సంతోషంగా లేను.. చిన్నప్పటి నుంచి నా టార్గెట్ అదే!
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Suriya : ఒకే ఏడాది 3 సినిమాలు.. సూర్య కొత్త రికార్డ్
ట్రెండింగ్
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..