Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 1.75 / 5
- MAIN CAST: Maadhav Bhupathiraju, Deepa Balu
- DIRECTOR: Nagaraj Manchala
- MUSIC:
- PRODUCER: Mayur Reddy Bandaru
Maremma Review: మాస్ మహారాజా రవితేజ కుటుంబం నుంచి మరో యువ హీరోగా మాధవ్ భూపతిరాజు పరిచయమవుతున్న చిత్రం ‘మారెమ్మ’. మంచాల నాగరాజ్ డైరెక్షన్లో రూపొందించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ట్రైలర్‌తో కాస్త అంచనాలు పెంచగా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథాంశం:
Also Read
మహిషాపురంలో మారెమ్మ అనే గ్రామ దేవత ఉగ్రరూపం దాల్చకుండా ఉండటానికి ప్రతి పదేళ్లకు ఒకసారి దున్నపోతును బలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. అలా బలివ్వాల్సిన ఓ దూడను కర్ణి (మాధవ్ భూపతిరాజు) ఎంతో ప్రేమగా పెంచుతాడు. ఆ దూడ కాస్తా పెద్ద దున్నపోతుగా మారుతుంది. మరోవైపు కర్ణి తన మరదలు మంజు (దీప బాలు)తో ప్రేమలో ఉంటాడు. కానీ కబడ్డీ గేమ్‌లో కర్ణి చేతిలో ఓడిపోయాడనే కక్షతో పక్క ఊరి ఉత్తమ్ (మనీష్) మంజును పెళ్లి చేసుకోవడానికి సంబంధం కుదుర్చుకుంటాడు. మరోవైపు పాత కక్షల కారణంగా జలంధర్ (వికాస్ వశిష్ట) ఆ దున్నపోతును అంతం చేయాలని చూస్తుంటాడు. జాతరకు కేవలం నాలుగు రోజులు ఉందనగా ఆ దున్నపోతు కనిపించకుండా పోతుంది. అసలు ఆ దున్నపోతును ఎవరు తీసుకెళ్లారు? జలంధర్ పగ ఏంటి? కర్ణి, మంజుల ప్రేమకథ ఏమైంది? చివరికి జాతర ఎలా ముగిసింది అనేదే ఈ సినిమా అసలు కథ.
విశ్లేషణ:
ఇలాంటి గ్రామీణ నేపథ్యం ఉన్న కథలు టాలీవుడ్‌కి కొత్తేమీ కాదు. గతంలో ఇదే జానర్లో వచ్చిన ‘పొట్టేలు’ సినిమాతో దీనిని పోల్చి చూస్తే, ఆ సినిమాలో బలమైన భావోద్వేగాలు, సస్పెన్స్ పండాయి. కానీ ఈ సినిమాలో అలాంటి ఎమోషన్స్ ఏమాత్రం వర్కౌట్ కాలేదు. ఫస్ట్ హాఫ్ అంతా ఏఐ విజువల్స్, వాయిస్ ఓవర్‌తో ప్రారంభమై, హీరో చిన్ననాటి ఎపిసోడ్స్, కబడ్డీ సీన్, లవ్ ట్రాక్‌తో కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్ సమయానికి వచ్చే మలుపు పర్వాలేదనిపించినా, సెకండ్ హాఫ్ పూర్తిగా ఆ దున్నపోతు కోసం వెతికే సీన్లతో నెమ్మదించింది. క్లైమాక్స్ చాలా సింపుల్‌గా ముగించడం, చెప్పాలనుకున్న సందేశానికి తెరపై చూపించిన దానికి పొంతన కుదరకపోవడం నిరాశపరుస్తుంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్ కథ అయినప్పటికీ, నటీనటుల యాసలో సహజత్వం కనపడ లేదు. గ్రామదేవత కల్చర్‌ను చూపించడంలో దర్శకుడు ప్రయత్నించినప్పటికీ, దాని చుట్టూ బలమైన సన్నివేశాలను రాసుకోవడంలో తడబడ్డాడు. క్లైమాక్స్ ఊహకు అందకుండా రాసుకున్నా అది జనానికి కనెక్ట్ అవడం కొంచెం కష్టమే. నిజానికి ఇలాంటి కథ చెబుతున్నపుడు జనానికి కనెక్ట్ అయ్యే అంశాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి కానీ ఎందుకో దథాకుడు పూర్తిగా ఆ విషయం మీద ఫోకస్ చేసినట్టు అనిపించలేదు. హీరో, దున్నపోతు మధ్య ఉండాల్సిన బంధాన్ని మరింత బలంగా చూపించి ఉంటే ఫలితం మరోలా ఉండేది.
నటీనటుల విషయానికి వస్తే హీరోగా ఎంట్రీ ఇచ్చిన మాధవ్ భూపతిరాజు తన మొదటి చిత్రానికి అనుగుణంగా యాక్షన్, ఎమోషనల్ సీన్లలో శాయశక్తులా ప్రయత్నించాడు. హీరోయిన్గా దీప బాలు తన పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించింది. విలన్ పాత్రలో వికాస్ వశిష్ట, మనీష్ తమ పరిధిలో డీసెంట్ నటన కనబరిచారు.
సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే సినిమాలో పాటలు మాత్రమే కాస్త ఉపశమనం కలిగిస్తాయి. వినసొంపైన మెలోడీస్ సినిమాకు ప్లస్ అయ్యాయి. అయితే సినిమాటోగ్రఫీ విషయంలో మరింత శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. పల్లెటూరి వాతావరణాన్ని, అందాలను సరిగ్గా కెమెరాలో బంధించలేకపోయారు. కొన్ని సీన్స్ షార్ట్ ఫిలింను తలపిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యావరేజ్‌గా ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండి, సాగదీసే సీన్లను కట్ చేసి ఉంటే సినిమా రన్‌టైమ్ మరింత క్రిస్ప్‌గా ఉండేది. బడ్జెట్ లిమిటేషన్స్ ఈ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తాయి.
ఫైనల్లీ: ‘మారెమ్మ’ రొటీన్ రూరల్ డ్రామా..
తాజావార్తలు
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!