Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
- మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు ట్రంప్ సంచలన $5,000 హామీ
- రిపబ్లికన్లు హౌస్, సెనేట్ రెండింటినీ గెలిస్తే హామీ అమలు
- భారత్‌లో ‘‘ఉచిత హామీలను’’ పోలి ఉన్న ట్రంప్ తాజా ప్రకటన
- డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయనే దానిపై క్లారిటీ లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump Freebie Politics: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భారతీయ ఎన్నికల నుంచి ప్రభావితమైనట్లు కనిపిస్తోంది. నవంబర్‌లో అమెరికాలో మిడ్ టర్మ్ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో సంచలన హామీ ఇచ్చారు. రిపబ్లికన్ పార్టీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్ రెండింటిపైనా నియంత్రణ కొనసాగించే అవకాశం ఇస్తే ప్రతీ వయోజన అమెరికన్ పౌరుడికి 5000 డాలర్ల డివిడెంట్ ఇస్తామని ప్రకటించారు. డల్లాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ ఈ హామీ ఇచ్చారు. అయితే, ఈ డబ్బును ఎలా చెల్లిస్తారు.? ఎక్కడి నుంచి ఇస్తారు? అనే దానిపై క్లారిటీ లేదు.
భారతదేశ ‘‘ఉచితాల’’తో పోలిక:
ట్రంప్ హామీని భారత దేశంలో వివిధ రాజకీయ పార్టీలు ఓటర్లకు ఇచ్చే ‘‘ఉచితాల’’తో పోల్చారు. మన దేశంలో ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి మిక్సీలు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్కూటీలు ఇలా ఉచితాలను ప్రకటించడం చూస్తూనే ఉంటాం. తమిళనాడులో సంక్షేమ పథకాలతో ప్రారంభమైన ఈ సంస్కృతి అన్ని రాష్ట్రాలకు, అన్ని పార్టీలకు పాకింది. ఉచితాలు లేకుంటే గెలిచి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ట్రంప్ హామీ కూడా భారత రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలాగే ఉంది.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
ట్రంప్‌కు ఈ ఎన్నికలు డూ ఆర్ డై:
2026 నవంబర్‌లో మిడ్‌టర్మ్ ఎన్నికల్లో గెలిస్తే ట్రంప్‌కు ఆ దేశ చట్టసభలపై నియంత్రణ ఉంటుంది. కాంగ్రెస్‌లోని రెండు సభల్లో నియంత్రణ కోల్పోతే రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇప్పటికే, ట్రంప్ అప్రూవల్ రేటింగ్ యూఎస్‌లో నానాటికి పడిపోతోంది. ఇక ఇరాన్ యుద్ధం ట్రంప్ వ్యూహానికి బెడిసికొట్టింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. దీంతోనే తన పార్టీకి ఓటేస్తే 5000 డాలర్లు అంటూ కొత్త హామీని ముందుకు తీసుకువచ్చారు.
డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది.?
ట్రంప్ ప్రతిపాదించిన 5,000 డాలర్ల హమీని అమలు చేస్తే.. $1 ట్రిలియన్కు పైగా ఖర్చయ్యే అవకాశం ఉంది. సుమారు 240 మిలియన్ల వయోజన అమెరికన్ పౌరులకు చెల్లిస్తే వ్యయం దాదాపు $1.2 ట్రిలియన్ వరకు ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. ఈ డబ్బు ఎక్కడి నుంచి ఇస్తారనే దానిపై ట్రంప్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మాత్రం టారిఫ్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉపయోగిస్తామని చెబుతున్నారు.
అయితే, వస్తున్న టారిఫ్‌లు ఈ హామీకి సరిపోతాయా? అనేది అసలు ప్రశ్న. నిపుణుల అంచనా ప్రకారం.. ప్రకారం ప్రస్తుత టారిఫ్ విధానాల ద్వారా వచ్చే పదేళ్ల ఆదాయం సుమారు $1.9 ట్రిలియన్గా ఉండొచ్చు. మరోవైపు ఒక్కసారి 5,000 డాలర్ల చెల్లింపునకే సుమారు $1.2 ట్రిలియన్ అవసరమయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!