రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
- Apple AirPods 5 ప్రారంభ ధర రూ.14,900
- వైర్లెస్ ఛార్జింగ్ కేస్‌తో AirPods 5 ధర రూ.17,900
- యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో 50% వరకు ఎక్కువ నాయిస్ తగ్గింపు
- కొత్త మల్టీపోర్ట్ అకౌస్టిక్ ఆర్కిటెక్చర్
- నెక్స్ట్ జనరేషన్ అడాప్టివ్ ఈక్యూ
- మెరుగైన ట్రాన్స్పరెన్సీ మోడ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple AirPods 5 Launched: యాపిల్ నుండి కొత్తగా ఓపెన్-ఇయర్ వైర్లెస్ ఇయర్‌బడ్స్ AirPods 5ను లాంచ్ చేసింది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)తో వచ్చిన ఈ కొత్త ఎయిర్‌పాడ్స్‌లో మెరుగైన ఆడియో, అడాప్టివ్ ఫీచర్లు, యాపిల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సిరి, లైవ్ ట్రాన్స్లేషన్ వంటి అనేక ఫీచర్లను అందిస్తోంది.
AirPods 5లో కొత్త మల్టీపోర్ట్ అకౌస్టిక్ ఆర్కిటెక్చర్, నెక్స్ట్ జనరేషన్ అడాప్టివ్ ఈక్యూ (Adaptive EQ)ను ఉపయోగించారు. AirPods 4లోని ANCతో పోలిస్తే కొత్త మోడల్ బయట శబ్దాలను 50% వరకు ఎక్కువగా తగ్గించగలదని యాపిల్ చెబుతోంది. ఇందుకోసం మెరుగైన కంప్యూటేషనల్ ఆడియో అల్గారిథమ్‌లను ఉపయోగించారు. వివిధ రకాల చెవులకు మెరుగ్గా సరిపోయేలా అకౌస్టిక్ ఆర్కిటెక్చర్‌ను కూడా రీ-ఇంజినీర్ చేశారు.
Also Read
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- 165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- 2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
వాయిస్‌లు, చుట్టుపక్కల శబ్దాలను మరింత సహజంగా వినేందుకు ట్రాన్స్పరెన్సీ మోడ్‌ను మెరుగుపరిచారు. అలాగే పరిసరాలను బట్టి ANC, ట్రాన్స్పరెన్సీ మోడ్ల మధ్య స్వయంచాలకంగా మారే అడాప్టివ్ ఆడియో ఫీచర్ ఉంది. యూజర్ మాట్లాడటం ప్రారంభించినప్పుడు మీడియా వాల్యూమ్‌ను ఆటోమేటిక్‌గా తగ్గించే కన్వర్జేషన్ అవేర్నెస్ కూడా ఇందులో లభిస్తుంది. వ్యక్తిగతీకరించిన “స్పటిల్ ఆడియో”తో పాటు దుమ్ము, చెమట, నీటి నిరోధకతను కూడా మెరుగుపరిచారు.
యాపిల్ ఇంటెలిజెన్స్‌కు సపోర్ట్ చేసే ఐఫోన్లను ఉపయోగించే వారికి AirPods 5 ద్వారా హ్యాండ్స్-ఫ్రీగా Siri AIని యాక్సెస్ చేయవచ్చు. మెసేజ్‌లు, ఈమెయిల్స్, ఫొటోలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆధారంగా చేసుకుని సిరి సమాధానాలు ఇవ్వడంతో పాటు యాప్స్‌లో వివిధ పనులను కూడా చేయగలదు. ఉదాహరణకు స్నేహితుడు మెసేజ్‌లో సిఫార్సు చేసిన పాటను ప్లే చేయమని లేదా ఈమెయిల్లో ఉన్న డిన్నర్ రిజర్వేషన్ వివరాలను ఆధారంగా నావిగేషన్ ప్రారంభించమని సిరిని అడగవచ్చు.
Siri AIలో ఎక్స్‌ప్రెసివ్ వాయిస్‌లు, మెరుగైన డిక్టేషన్, వాట్సాప్, ఆడిబిల్ వంటి యాప్స్‌కు సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. సిరి ఇంట్రాక్షన్స్ ఫీచర్ ద్వారా తల ఊపడం లేదా అడ్డంగా కదపడం వంటి హావభావాలతో ‘అవును’, ‘కాదు’ అనే సమాధానాలు ఇవ్వవచ్చు. AirPods 5లో మరో ముఖ్యమైన ఫీచర్ “లైవ్ ట్రాన్సలేషన్”. “ఆపిల్ ఇంటలిజెన్స్” సహాయంతో వివిధ భాషల మధ్య సంభాషణలను అనువదించుకోవచ్చు. అవసరమైన భాషలను “ట్రాన్సలేట్” యాప్‌లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రెండు AirPods స్టెమ్‌లను ఒకేసారి నొక్కడం, “Siri, start Live Translation” అని చెప్పడం లేదా ఐఫోన్‌లోని Action Buttonను ఉపయోగించడం ద్వారా ఈ ఫీచర్‌ను ప్రారంభించవచ్చు. యూజర్ తనకు నచ్చిన భాషలో సంభాషణను వినేలా ఇది పనిచేస్తుంది.
AirPods 5 విత్ వైర్ లెస్ ఛార్జింగ్ కేసు వేరియంట్లో కొత్తగా ఫోర్స్ సెన్సార్‌తో కూడిన వాల్యూమ్ స్వైప్ కంట్రోల్ ఇచ్చారు. స్టెమ్పై పైకి లేదా కిందికి స్వైప్ చేయడం ద్వారా వాల్యూమ్‌ను పెంచడం లేదా తగ్గించడం వీలవుతుంది. ఓపెన్-ఇయర్ ఎయిర్‌పాడ్స్‌లో తొలిసారిగా ఈ ఫీచర్‌ను అందిస్తున్నట్లు యాపిల్ తెలిపింది. బ్యాటరీ విషయానికి వస్తే.. ANC ఆన్‌లో ఉన్నప్పుడు ఒక్కసారి ఛార్జింగ్‌తో 5 గంటల వరకు ప్లేబ్యాక్ అందిస్తుంది. ఇది AirPods 4 with ANC కంటే గంట ఎక్కువ బ్యాటరీ బ్యాకప్. ఛార్జింగ్ కేసుతో కలిపి ANCతో 22 గంటల వరకు వినియోగించుకోవచ్చు. Apple Watch ఛార్జర్లు, Qi-కంపాటిబుల్ ఛార్జర్లు, USB-C ద్వారా కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు.
సస్టైనబిలిటీకి కూడా యాపిల్ ప్రాధాన్యత ఇచ్చింది. AirPods 5లో మొత్తంగా 40% రీసైకిల్డ్ మెటీరియల్‌ను ఉపయోగించారు. వైర్లెస్ ఛార్జింగ్ కేసులో 70% రీసైకిల్డ్ ప్లాస్టిక్, బ్యాటరీలో 100% రీసైకిల్డ్ కోబాల్ట్‌ను వినియోగించారు. సరఫరా వ్యవస్థలో 35% పునరుత్పాదక ఇంధనాన్ని ఉపయోగిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్యాకేజింగ్ కూడా 100% ఫైబర్ ఆధారితంగా ఉండి, ఇంట్లోనే రీసైకిల్ చేసుకునేలా రూపొందించారు.
ధర విషయానికి వస్తే భారత్‌లో AirPods 5 ధర రూ.14,900గా నిర్ణయించారు. వైర్లెస్ ఛార్జింగ్ కేస్‌తో కూడిన AirPods 5 ధర రూ.17,900. ప్రస్తుతం భారత్‌తో పాటు అమెరికా, మరో 65కి పైగా దేశాలు, ప్రాంతాల్లో ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 18 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. AirPods 5లోని పూర్తి ఫీచర్లను ఉపయోగించాలంటే తాజా ఆపరేటింగ్ సిస్టమ్‌తో కూడిన అనుకూలమైన యాపిల్ డివైజ్ అవసరం. ఆపిల్ ఇంటలిజెన్స్ సపోర్ట్ ఉన్న డివైజ్‌లలో iOS 27 సెప్టెంబర్ 14 నుంచి అందుబాటులోకి రానుంది. కొన్ని Siri AI, Live Translation ఫీచర్లు భాష, ప్రాంతాన్ని బట్టి అందుబాటులో ఉండకపోవచ్చు.
Official Trailer: Apple AirPods 5 pic.twitter.com/iUJdFoxwt1
— Apple Design (@TheAppleDesign) September 9, 2026
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!