Vrushakarma Release Update: ‘వృషకర్మ’ కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vrushakarma Release Date Update: అక్కినేని నాగ చైతన్య, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న మిస్టికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. వృషకర్మ మూవీ విడుదల తేదీని ఈరోజు సాయంత్రం ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఇప్పటికే వృషకర్మను డిసెంబర్లో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. రెబల్ స్టార్ ప్రభాస్‌ను నాగ చైతన్య ఢీకొట్టనున్నాడు. డిసెంబర్ 3న ‘ఫౌజీ’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో బాక్సాఫీస్ పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది. ఫౌజీ, వృషకర్మ సినిమాల రిలీజ్ డేట్స్‌పై ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చ మొదలైంది.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
వృషకర్మలో జయరామ్‌తో పాటు ‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ కీలక పాత్రలో నటిస్తున్నారు. స్పర్శ్ శ్రీవాస్తవ ఈ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. ఆయన ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ మిస్టిక్ హారర్ థ్రిల్లర్‌లో నాగ చైతన్య నిధి అన్వేషకుడిగా కనిపించనున్నాడు. విరూపాక్షతో హారర్, మిస్టరీ జానర్లో తనదైన ముద్ర వేసిన కార్తీక్ దండు.. వృషకర్మతో ఎలాంటి థ్రిల్‌ను అందిస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. మరి ఈరోజు సాయంత్రం మేకర్స్ ప్రకటించబోయే రిలీజ్ డేట్ ఏంటో చూడాలి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?