Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
- సహారన్పూర్ కలెక్టరేట్ మసీదు కూల్చివేతపై వివాదం.
- మసీదు తొలగింపును ప్రబోధానంద గిరి ప్రశంసలు.
- “అభ్యంతరం ఉంటే పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ వెళ్లండి” అంటూ వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saharanpur Mosque Row: ఉత్తర్ ప్రదేశ్ సహారన్పూర్ కలెక్టరేట్ ప్రాంగణంలోని మసీదు కూల్చివేత వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ స్థలంలో ఉన్న మసీదును అధికారులు కూల్చేశారు. అయితే, దీనిని సమాజ్‌వాదీ, కాంగ్రెస్ వంటి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఈ వ్యవహారంపై మహామండలేశ్వర్ స్వామి ప్రబోధానంద గిరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. మసీదు తొలగింపుపై అభ్యంతరం ఉన్నవాళ్లు పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ వెళ్లవచ్చని వ్యాఖ్యానించారు.
సహారన్పూర్ వచ్చిన ప్రబోధానంద గిరి ఎస్ఎస్పీ ఆఫీసుకు వెళ్లి పోలీస్ అధికారుల్ని కలిశారు. కలెక్టరేట్ పరిపాలనకు సంబంధించిన ప్రాంతమని, అక్కడ మతపరమైన కార్యకలాపాలకు స్థానం లేదని అన్నారు. మసీదుపై చర్యలు తీసుకున్న పోలీస్, ఇతర అధికారుల్ని ప్రశంసించారు. మసీదును కోర్టు ఆదేశాల మేరకే తొలగించారని ఆయన పేర్కొన్నారు. మసీదు వక్ఫ్ బోర్డుకు చెందినదని వస్తు్న్న వాదనల గురించి మాట్లాడుతూ.. సంబంధిత పత్రాలు ఉంటే కోర్టులో సమర్పించాలని సవాల్ చేశారు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
అయితే ఈ అంశంపై న్యాయపరమైన వివాదం కొనసాగుతోంది. జూలై 16న సహారన్పూర్ సిటీ మేజిస్ట్రేట్ మసీదును తొలగించాలని ఆదేశించడంతో పాటు రూ.6.41 కోట్ల జరిమానా విధించారు. ఆ ఉత్తర్వును జిల్లా కోర్టు సెప్టెంబర్ 2న సమర్థించింది. అనంతరం సెప్టెంబర్ 5న అధికారులు మసీదును కూల్చివేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ సెప్టెంబర్ 9న అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
పాక్, బంగ్లాదేశ్ వెళ్లండి.. మసీదు కింద భావి..
మసీదు తొలగింపును వ్యతిరేకిస్తున్న వారిపై ప్రబోధానంద గిరి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మసీదు తొలగింపుపై అభ్యంతరం ఉంటే వారు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వెళ్ల వచ్చని ప్రయాణ ఖర్చులు లేని వారికి తానే ఖర్చల్ని భరిస్తానని చెప్పారు.
మసీదు కూల్చివేత తర్వాత దాని కింద ఒక పురాతన బావి వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. మసీదు శిథిలాల కింద సుమారు 20 అడుగుల లోతైన పాత బావి బయటపడింది. ఈ బావికి చారిత్రక, మతపరమైన ప్రాధాన్యం ఉందా అనే అంశంపై దర్యాప్తు పూర్తయ్యే వరకు తుది నిర్ణయానికి రావొద్దని సూచించారు.
తాజావార్తలు
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!