బాలీవుడ్ సీనియర్ నటి ముంతాజ్ ఎంతటి అందగత్తె అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 70 వ దశకంలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె అందానికి ఫిదా కానీ వారుండరు. అయితే ప్రస్తుతం ఆమె సినిమాలకు స్వస్తిచెప్పి రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ముంతాజ్ వయసు 70 ఏళ్లు. ముంతాజ్ కెరీర్ పీక్స్ లో ఉండగానే వ్యాపార వేత్త మయూర్ మాధవని వివాహం చేసుకున్నారు. ఆ తరువాత కొన్ని విభేదాలు వలన ఇద్దరు విడిపోయారు. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు తన భర్తకు విడాకులు ఎందుకు ఇచ్చారు అనేది కూడా వెల్లడించారు. ” సాధారణంగా మగవారికి పెళ్లి తరువాత సంబంధాలు ఉండడం సహజమే.. నాకు తెలిసి మా ఆయనకు ఒక్కరే ఉండేవారు. ఈ విషయాన్ని డైరెక్ట్ గా ఆయనే నాకు చెప్పారు. అలాగని నన్ను తక్కువ చేయలేదు. ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ముంతాజ్ నువ్వు నా భార్యవి..నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తూనే ఉంటాను. ఎప్పటికీ నీ చేయి వదిలిపెట్టనని చెప్పేవారు. కానీ నేను చాలా మొండిదాన్ని. ఆ విషయంలో అంతన్ని అంత ఈజీగా తీసుకోలేకపోయాను. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి.
అతడి వివాహేతర సంబంధం గురించి తెలిసాక ఒటరినయ్యా. ఎంతో బాధ కల్గింది. ఇక ఆ సమయంలో ఎవరో ఒకరు ఓదారిస్తే వారికి దగ్గరవుతాం.. నా విషయంలో అది కూడా జరిగింది. ఒకరికి దగ్గరయ్యాను.. కానీ అది సీరియస్ అయ్యేంతలోపే తెగిపోయింది. నేను ఎంతో గొప్పగా మహారాణిలా బ్రతికాను.. కానీ నా నుంచి నా భర్త ఏదీ ఆశించలేదు. నేను అనారోగ్యానికి గురయ్యానంటే ఆయన ఏడ్చినంత పనిచేస్తారు. నేనంటే అంత ప్రేమ కురిపిస్తారు. కానీ ఎందుకో నేను అతనితో అడ్జస్ట్ కాలేకపోయాను” అని ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.