Hrithik Roshan birthday celebrations: జనవరి 10న అంటే నిన్నటి రోజున హీరో హృతిక్ రోషన్ తన 50వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్బంగా హృతిక్ కి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుట్టినరోజు విషెస్ తెలిపారు. అయితే ఆసక్తికర అంశం ఏమిటంటే ఆయన అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు లో తమ అభిమాన హీరో బర్త్ డే సెలబ్రెషన్స్ ను గ్రాండ్ గా చేశారు. నిజానికి ఆయన నార్త్ హీరో అయినా క్రిష్ సిరీస్ అలాగే మరికొన్ని సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. సౌత్ లో కూడా ఆయనకు మంచి ఫ్యాన్బేస్ ఉంది.
Prashanth Varma: తప్పు చేస్తున్నప్పుడు తప్పని చెప్పకపోవడం పెద్ద తప్పు.. ప్రశాంత్ వర్మ కీలక వ్యాఖ్యలు
ఈ క్రమంలోనే ఆయన పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా అభిమానులు హైదరాబాద్ లో, విజయవాడలో అలాగే వైజాగ్ లో ఉన్న కొన్ని అనాదాశ్రమాలలో ఫుడ్ డొనేట్ చేశారు. అలాగే మంగళగిరి, వైజాగ్ వంటి చోట్ల మొక్కలు నాటడం జరిగింది. చెన్నై సిటీ ఆహా హైదరాబాద్ , విజయవాడ, మంగళగిరి, వైజాగ్ వంటి చోట్ల కేక్ కటింగ్ చేశారు. చెన్నై సిటీలో ట్రక్ లో ఫుడ్ సైతం డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఇక అలాగే కొంతమంది ఫాన్స్ హృతిక్ రోషన్ హిట్ సాంగ్స్ కు ఫ్లాష్ మాబ్ లు కూడా చేశారు. అంతేకాక తమ అభిమాన హీరో సినిమా ఫైటర్ జనవరి 25న విడుదల అవుతున్న సందర్భంగా సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని హృతిక్ రోషన్ ఫాన్స్ కోరుకున్నారు.