దీపావళికి పది రోజుల ముందు చాక్లెట్ కంపెనీ క్యాడ్‌బరీ కొత్త ప్రకటనతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించారు. ఈ దీపావళికి స్థానిక దుకాణాల నుండి వస్తువులను కొనుగోలు చేయాలని ఈ ప్రకటనలో క్యాడ్‌బరీ తన వీక్షకులకు విజ్ఞప్తి చేసింది. ‘కోవిడ్ సమయంలో నష్టపోయిన పెద్ద వ్యాపారాలు, బ్రాండ్‌లు మళ్ళీ పుంజుకున్నాయి. కానీ చిన్న దుకాణాలు ఇప్పటికీ బాధపడుతున్నాయి’ అని ప్రారంభమయ్యే ఈ యాడ్ 2.18 నిమిషాలు ఉంది. అందులోనే…
కోలీవుడ్ సూపర్ స్టార్ తలపతి విజయ్ ప్రస్తుతం తన తదుపరి డార్క్ థ్రిల్లర్ చిత్రం “బీస్ట్” షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. నెల్సన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా తరువాత విజయ్ 66వ చిత్రం డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనుంది. విజయ్ ఫస్ట్ డైరెక్ట్ మూవీగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీని దిల్ రాజు నిర్మించనున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు ఇది 50వ చిత్రం…
అక్టోబర్ 21వ తేది, గురువారం దాదాపు నాలుగు గంటల పాటు ఎన్సీబీ అధికారులు బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేను ఆర్యన్ ఖాన్ తో ఉన్న అనుబంధం, డ్రగ్స్ వాడకంపై తమ కార్యాలయంలో విచారించారు. దానికి ముందు ఆమె సెల్ ఫోన్ ను, లాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. అలానే ఆర్యన్ తో అనన్య గతంలో చాటింగ్ చేసిన విషయాలను ఎన్సీబీ అధికారులు ఈ సందర్భంగా ఆమె దగ్గర ప్రస్తావించినట్టు తెలుస్తోంది. విశేషం ఏమంటే… ఆర్యన్, అనన్య…