Nikhil: టాలీవుడ్ కు- బీజేపీ కు మధ్య ఏం జరుగుతుందో అసలు అర్ధం కావడం లేదు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీజేపీ ప్రచార అస్త్రాలను సంధిస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ సినీ ప్రముఖులను బీజేపీ నేతలు కలుస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ నేత అమిత్ షా ఎన్టీఆర్ ను కలిశారు. జేపీ నడ్డా, హీరో నితిన్ తో భేటీ అయ్యారు. అయితే వీరి మధ్య జరిగిన సంభాషణ ఏంటి అనేది ఎవరికి తెలియదు. షా- ఎన్టీఆర్ మధ్యన అయితే ఆర్ఆర్ఆర్ సినిమా గురించి తప్ప వేరే ఏ రాజకీయానికి సంబంధించిన విషయాలు చర్చకు రాలేదని చెప్పుకొస్తున్నారు. సరే ఎన్టీఆర్ ను అయితే సినిమా కోసం కలిశారు అనుకోవచ్చు. మరి నితిన్ ను ఎందుకు కలిశారు అనేది కొన్నిరోజులుగా అభిమానులకు అంతుపట్టని ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఇదేనంటూ సోషల్ మీడియా లో ఒక వార్త వైరల్ గా మారింది.
కార్తికేయ 2 చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో హీరో నిఖిల్ ను కలిసి అభినందించాలని జేపీ నడ్డా అనుకున్నారట.. నితిన్, నిఖిల్ పేర్లు సేమ్ గా ఉండడంతో బీజేపీ నేతలు నిఖిల్ కు బదులు నితిన్ ను ఆహ్వానించారట. ఒక్కసారిగా ఈ వార్త వినగానే మైండ్ బ్లాక్ అయ్యిపోయింది కదా.. నితిన్ ను బీజేపీ కలవడానికి కారణం కార్తికేయ 2. కృష్ణుడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకొని భారీ వసూళ్లను అందుకొంటుంది. ఇక ఆ హీరోను అభినందించడానికి వచ్చిన నడ్డాకు నిఖిల్ ఎవరో, నితిన్ ఎవరో తెలియక కన్ప్యూజ్ అయ్యారట. నిఖిల్ కు దక్కాల్సిన సన్మానం నితిన్ కు దక్కిందంటూ చెప్పుకొస్తున్నారు. ఇక మరికొంతమంది ఇది మరి విడ్డూరం.. హీరో ఎవరు..? సినిమా ఏది..? అని కూడా చూసుకోకుండా భేటీలు అయ్యి, చర్చలు జరుపుతారా..? ఇదంతా ఫేక్ . ప్రచారం కోసం నితిన్ ను అడగడానికె బీజేపీ వచ్చింది. నితిన్ అని తెలిసే జేపీ నడ్డా మాట్లాడారు అని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా ఈ వార్త తెలిసాకా బీజేపీ ని మీమ్ పేజీలు ఆడేసుకుంటున్నాయి. యో చూసుకోబడలా అని కొందరు.. ఏదో పొరపాటు అయిపోయిందిలే ఈసారికి కానిచ్చేయ్ అని మరికొందరు ట్రోల్స్ చేస్తున్నారు.