Biggboss 6: బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ముగిసింది. అందరు అనుకున్నట్లుగానే సింగర్ రేవంత్ నే టైటిల్ వరించింది. ఎట్టకేలకు తన కోపంతోనే రేవంత్ కప్ గెలిచాడు. శ్రీహన్, రేవంత్ మధ్య గట్టి పోటీ నడిచింది. రూ. 30 లక్షలు తీసుకోమని ఆఫర్ ఇచ్చిన ఈ ఇద్దరు వద్దని నిలబడ్డారు. ఇక చివరికి నాగ్.. టైటిల్ విన్నర్ రేవంత్ అని ప్రకటించాడు. శ్రీహన్ రన్నర్ గా నిలిచాడు.
ఇక స్టేజీపై రేవంత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తనకు ఓటు వేసి గెలిపించిన అభిమానులకు, ప్రేక్షకులకు రేవంత్ థాంక్స్ చెప్పాడు. ఇక కంటెస్టెంట్లు సైతం తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. టైటిల్, క్యాష్ ప్రైజ్ ను నాగ్ తన చేతుల మీదుగా రేవంత్ కు అందించాడు.