బిగ్ బాస్ హంగామా మొదలు కానుంది. తెలుగులో సీజన్ 6 వచ్చే నెల 4వ తేదీనుంచి ఆరంభం కానున్న బిగ్ బాస్ 6 ప్రోమో విడుదల అయింది. ఈ సీజన్ కి కూడా నాగ్ నే హోస్ట్. అయితే ఈ సారి బిగ్ బాస్ లో సందడి చేసే సెలబ్రెటీలు ఎవరన్నది ఇంకా వెల్లడి కాలేదు. అయితే ప్రోమోతో మరోసారి ఆకట్టుకున్నాడు నాగ్. లైఫ్ లో ఏ మూవ్ మెంట్ అయినా బిగ్ బాస్ తర్వాతే అంటూ బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఎంటర్ టైన్ మెంట్ కి అడ్డా ఫిక్స్ అంటూ జనాల ముందుకు వచ్చాడు నాగార్జున.
తొలి ఐదు సీజన్స్ లో ఏ ఒక్క మహిళ బిగ్ బాస్ టైటిల్ గెలవలేదు. అయితే ఓటీటీలో మాత్రం తొలి సారే బిందుమాధవి విజేతగా నిలవటం విశేషం. బిగ్ బాస్ విజేతలుగా నిలిచిన వారైనా, ఫైనల్స్ కి చేరుకున్నవారైనా వెండితెరపై అంతగా రాణించింది లేదు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 6లో ఎవరు పాల్గొనబోతున్నారు? వారిలో టైటిల్ గెలిచే సత్తా ఎవరికి ఉంది? వీటన్నికి సమాధానం త్వరలోనే లభించనుంది.