మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’ మొదటి రోజు షూటింగ్ స్టార్ట్ అయిందన్న విషయాన్నీ తెలియజేస్తూ దర్శకుడు ఎగ్జైటింగ్ అప్డేట్ ఇచ్చారు. చిరంజీవి ఎంతగానో ఎదురుచూస్తున్న “భోళా శంకర్” షూటింగ్ ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ తొలిరోజు షూటింగ్‌కు ముందు పెద్దమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ ను పంచుకున్నారు.
Read Also : రియల్ చినతల్లికి సూర్య సూపర్ హెల్ప్… అసలైన ‘జై భీమ్’పై ప్రశంసలు
“భోళా శంకర్”లో చిరు కథానాయికగా తమన్నా నటిస్తుండగా, మెగాస్టార్ సోదరిగా కీర్తి సురేష్ కనిపించనుంది. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘వేదాళం’ మాదిరిగానే భోళా శంకర్” కథ కూడా కోల్‌కతా నేపథ్యంలో సాగుతుంది కాబట్టి సినిమా షూటింగ్‌లో ఎక్కువ భాగం ఈ ఐకానిక్ సిటీలో జరుగుతుంది. మహతి స్వర సాగర్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను అందించగా, డడ్లీ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తారు. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.