Vijayasai Reddy Counter to Megastar Chiranjeevi: తాజాగా జరిగిన వాల్తేరు వీరయ్య 200 రోజుల విజయోత్సవ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే పూర్తి వీడియో రిలీజ్ కాకపోవడంతో ప్రభుత్వాలు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినీ పరిశ్రమల టార్గెట్ చేయకూడదని అర్థం వచ్చేలా కామెంట్లు చేసినట్టు వీడియో వైరల్ అయింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు ఉన్నాయని భావించి ప్రభుత్వం తరఫున మంత్రులు అధికార పార్టీకి చెందిన నేతలు పెద్ద ఎత్తున మెగాస్టార్ చిరంజీవి మీద విరుచుకుపడ్డారు. అయితే అసలు మెగాస్టార్ చిరంజీవి టార్గెట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాదని అర్థం వచ్చేలా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన పూర్తి వీడియోని తాజాగా సినిమా యూనిట్ రిలీజ్ చేసింది.
సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు. ఫిలిం స్టార్స్ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే. వాళ్ళూ మనుషులే. వారి గురించి మీకెందుకు, వీరి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదు. వారి యోగక్షేమాల…
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 10, 2023
నిజానికి ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయకున్నా ఏపీ అధికర పార్టీ కీలక నేత అయిన విజయసాయి రెడ్డి రాజ్యసభలో సినిమాటోగ్రఫీ బిల్లు చర్చ జరిగినప్పుడు చేసిన సూచనల గురించి చిరంజీవి మాట్లాడారు. ఏ హీరో ఎంత తీసుకుంటున్నారు అనే విషయం గురించి కూడా పెద్దల సభలో మాట్లాడాల్సిన అవసరం లేదని సినిమా వాళ్లు చాలా చిన్న వాళ్ళని చెబుతూ మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది. ఇక ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఒక ట్వీట్ చేశారు. ‘’సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు. ఫిలిం స్టార్స్ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ, సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే అని పేర్కొన్న సాయి రెడ్డి వాళ్ళూ మనుషులే, వారి గురించి మీకెందుకు? వీరి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదని అన్నారు. వారి యోగక్షేమాల పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది.’’ అని అంటూ పరోక్షంగా ఆయన కౌంటర్ వేశారు. అలాగే కొందరు సినిమా హీరోలు పాపం చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొంటూ, వీలయితే ఉచితంగా నటిస్తూ లక్షలాది డైలీ వేజ్ సినీ కార్మికులను బతికిస్తున్నారని అన్నారు. కళామతల్లిపై ప్రేమతో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి వృద్ధి కోసం అహర్నిశలూ చెమటోడుస్తున్నారు. అలాంటి వారికి హాట్సాఫ్ అని అన్నారు.