“భీమ్లా నాయక్” సినిమా విడుదలకు ఇంకా ఐదు రోజులు ఉండగానే పవన్ అభిమానుల రచ్చ మొదలైంది. మెల్బోర్న్ లో జాతర షురూ అంటూ కార్లతో PSPK అనే అక్షరాలను ఫామ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మెగా అభిమానులు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న “భీమ్లా నాయక్” ఇప్పటికే USAలో ప్రీమియర్ ప్రీ-సేల్స్ నుండి $200K కంటే ఎక్కువ వసూలు చేసి అద్భుతమైన ఫీట్ ను సాధించింది. ఇక సోషల్ మీడియాలో పవన్ క్రేజ్ చూస్తుంటే ఈ నెల 25న విడుదల కానున్న”భీమ్లా నాయక్” రికార్డులన్నీ బ్రేక్ చేయడం ఖాయం అనిపిస్తోంది.
Read Also : Yashoda : సమంత కోసం 7 స్టార్ హోటల్… కోట్లలో ఖర్చు
ఇక ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా, సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామా 2020లో వచ్చిన బ్లాక్ బస్టర్ మలయాళ చిత్రం “అయ్యప్పనుమ్ కోషియుమ్”కి రీమేక్. నిత్యామీనన్, సంయుక్తా మీనన్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
It’s official that #BheemlaNayak Jaathara has officially started from Melbourne #PawanKalyan ???? pic.twitter.com/sztCfJyKom
— AB (@alwaysabhiroop) February 20, 2022