Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలపై ఉండే హైప్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమాలకు సంబంధించిన చిన్న విషయం అయినా సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయిపోతుంది. ప్రస్తుతం ప్రభాస్ సినిమా కోసం ఓ క్రేజీ హీరోయిన్ ను తీసుకోబోతున్నారంట. ఈ విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రశాంత్ వర్మతో ప్రభాస్ ఓ భారీ మైథికల్ సినిమా చేయాల్సి ఉంది. ఈ మూవీ కోసం ఇప్పటి నుంచే నటులను తీసుకునే పనిలో పడ్డారంట దర్శకుడు. ఇందులో భాగంగా ఓ క్రేజీ హీరోయిన్ ను తీసుకునేందుకు చర్చలు జరిపారంట. ఆమె ఎవరో కాదు భాగ్య శ్రీ భోర్సే. ప్రస్తుతం ఆమె రామ్ తో ఓ మూవీ చేస్తోంది.
Read Also : NBK : వీరసింహ రెడ్డి సినిమా వెనుక ఇంత డ్రామా నడిచిందా
అలాగే విజయ్ దేవరకొండతో కూడా సినిమా చేస్తోంది. ఈ రెండింటిలో కింగ్ డమ్ షూటింగ్ దాదాపు పూర్తి అయింది. రామ్ సినిమా షూటింగ్ సగం వరకు కంప్లీట్ అయింది. కాబట్టి ఆమె డేట్స్ అడ్జస్ట్ అవుతాయి. త్వరలోనే ఆమెను కన్ఫర్మ్ చేయబోతున్నారంట. ఇలా వచ్చిందో లేదో అలా వరుస ఛాన్సులు కొట్టేస్తోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అవి రీలజ్ కాకముందే ప్రభాస్ సరసన ఛాన్స్ అంటే గోల్డెన్ ఆఫర్ కొట్టేసినట్టే. ఈ మూవీలో గనక ఆమెను కన్ఫర్మ్ చేస్తే పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ రావడం ఖాయం అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ, ది రాజాసాబ్ సినిమాలు కంప్లీట్ చేసే పనుల్లో ఉన్నాడు.
Read Also :Mouni Roy : అర్ధరాత్రి నా రూమ్ లోకి రావాలని చూశాడు.. ప్రముఖ నటి కామెంట్స్