నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన భగవంత్ కేసరి సినిమా తాజాగా విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. నిన్న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.. బాలయ్య ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేసిన ఈసినిమాలో బాలయ్య జోడీగా కాజల్.. కూతురుగా శ్రీలీల నటించారు… కాగా, ఇప్పుడు శ్రీలీలా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..
అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో ఫ్యాన్స్ ను అలరించే విధంగా అన్నీ జాత్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల నటించడం విశేషం. కాజల్ హీరోయిన్ గా నటించగా.. భగవంత్ కేసరిగా బాలయ్య అదరగొట్టారు.. కాజల్ కు ప్రస్తుతం సీనియర్ హీరోల సరసన మాత్రమే అవకాశాలు వస్తున్నాయి.. ఇకపోతే స్టార్ హీరోయిన్ ఇమేజ్ కు అడుగు దూరంలో ఉన్న శ్రీలీల కూతురు పాత్రలో నటించి పెద్ద సాహసమే చేసిందని చెప్పుకోవాలి.. ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఈ ఇద్దరి రెమ్యూనరేషన్ ఎంత ఉంటుందనే డౌట్ చాలా మందకి వచ్చి ఉంటుంది. అయితే ఈ ఇద్దరిలో కాజల్ కంటే కూడా శ్రీలీలనే ఎక్కువగా రెమ్యూనరేషన్ వసూలు చేసిందట.. పెళ్లి తరువాత కాజల్ కు అవకాశాలు తగ్గాయి. దాంతో పారితోషికం కూడా తగ్గింది అని చెప్పాలి. భగవంత్ కేసరి సినిమాలో కాత్యాయనీ అనే మిడిల్ ఏజ్డ్ పాత్రలో నటించింది కాజల్.. ఈ సినిమాకు గాను కాజల్ 1.05 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే కాజల్ కంటే శ్రీలీల ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నట్టుసమాచారం. శ్రీలీల మాత్రం ఈసినిమాకు ఏకంగా 1.8 కోట్లు పారితోషికం అందుకున్నట్టు తెలుస్తుంది.. ఈ సినిమా ఓటీటి హక్కులను ప్రైమ్ తీసుకున్న విషయం తెలిసిందే.. మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..