Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సినిమాల కంటే ఎక్కువగా బండ్ల గణేష్ ఇంటర్వ్యూల ద్వారా ఫేమస్ అయ్యాడు. మనసుకు ఏది అనిపిస్తే దాన్ని మాట్లాడే స్వభావం ఉన్న బండ్ల గణేష్.. ఐదేళ్ల క్రితం కాంగ్రెస్ కనుక ఎన్నికల్లో గెలవకపోతే 7 ఓ క్లాక్ బ్లేడ్ తో కోసుకుంటా అని నిర్మొహమాటంగా చెప్పుకొచ్చాడు. అయితే బండ్లన్న చెప్పిన మాటలు నిజం కాలేదు. కాంగ్రెస్ ఓడిపోయింది. అప్పటినుంచి ఇప్పటివరకు.. బండ్లన్న పై ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. ఇక కొన్నేళ్ల క్రితం నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్న బండ్ల.. ఇప్పుడు మళ్లీ తెరమీదకు వచ్చాడు. గత కొన్నిరోజుల నుంచి కాంగ్రెస్ గెలుస్తుంది అంటూ చెప్పుకొచ్చిన బండ్ల వ్యాఖ్యలు నిజమయ్యాయి. ఎట్టేకలకు కాంగ్రెస్ గెలిచింది. డిసెంబర్ 7 న LB స్టేడియంకు దుప్పటి తీసుకెళ్లి.. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేవరకు ఎదురుచూస్తాను అని చెప్పుకొచ్చి షాక్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కూడా ట్రోల్ అవుతున్న నేపథ్యంలోనే మరోసారి కెమెరా ముందుకు వచ్చి.. తనమీద వచ్చిన ట్రోలింగ్ గురించి చెప్పుకొచ్చాడు.
Nithiin: ఆ నిర్మాతను ఇరికించిన నితిన్.. పర్లేదులే మంచే జరిగింది
“కాంగ్రెస్ అధికారంలోకి రావడం నాకు చాలా హ్యాపీ గా ఉంది. ప్రమాణ స్వీకారానికి ముందు స్టేడియంలో వెళ్లి పడుకుంటా అని చెప్పాను. కానీ, దేవుడు.. ఆ ప్రమాణ స్వీకారాన్ని కూడా ముందుకు జరిపిస్తున్నాడు. తెలంగాణ ప్రజలు, ప్రకృతి, భగవంతుడు కూడా త్వరగా ప్రభుత్వాన్ని ఫార్మ్ చేయమని సూచిస్తున్నారు. ఇది ప్రజల విజయం.. తెలంగాణనే బంగారం.. ఈ బంగారు పాలన రేపటి నుంచి జరగబోతుంది” అని చెప్పుకొచ్చాడు. 2018 లో పోటీచేయాలనుకున్నారు.. సీటు ఇవ్వలేదని రాజకీయాల నుంచి వైదొలిగారు.. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ లో ఎప్పడు చేరారు అన్న ప్రశ్నకు బండ్లన్న మాట్లాడుతూ.. ” నేను ప్రస్తుతానికి వైదొలుగుతానని చెప్పాను.. ఎందుకంటే.. నా సమస్యలు.. నా ఒత్తిళ్లు.. టీఆర్ ఎస్ పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక వైదొలుగుతాను అన్నాను కానీ, నేను పుట్టినప్పటినుంచి కాంగ్రెస్.. ఎప్పటికీ కాంగ్రెస్ లోనే ఉంటాను. సీటు ఇచ్చిన వెళ్లకపోవడానికి కారణం.. నా సమస్యలు నాకున్నాయి. ఊరికే పెద్దోళ్లు దళితులను సీఎం చేస్తాం.. అది చేస్తాం అన్నవాళ్లను వదిలేసి.. బ్లేడ్ అన్నందుకు ఐదేళ్లు ట్రోల్ చేశారు.. ఇప్పుడు నేను కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పాను. ఇప్పుడు ఎవరు ఏం అనరే.. అప్రిషియేట్ చేయరే.. డిసెంబర్ 7 న ప్రమాణ స్వీకారం అన్నాను.. ఇది ఎన్ని రోజులు ట్రోల్ చేస్తారో చూడాలి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుత, ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
బ్లేడ్ అన్నందుకు ఐదేళ్లు ట్రోల్ చేశారు..ఇప్పుడు దీన్ని ఎన్ని రోజులు ట్రోల్ చేస్తారో చూస్తా..! – Bandla Ganesh#BandlaGanesh #Congress #TelanganaElections #ElectionResults #TelanganaAssemblyElection2023 #NTVTelugu pic.twitter.com/kVVQ45Q241
— NTV Telugu (@NtvTeluguLive) December 3, 2023