Balamevvadu Traler Launch: ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా నటిస్తున్న కొత్త సినిమా ‘బలమెవ్వడు’. ఈ సినిమా వైద్య రంగంలోని దోపిడీని ప్రశ్నించబోతోంది. సత్య రాచకొండ దర్శకత్వంలో ఈ మూవీని ఆర్. బి. మార్కండేయులు నిర్మిస్తున్నారు. సీనియర్ నటులు ఫృథ్విరాజ్, సుహాసిని, నాజర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుండి విడుదలైన టీజర్, మరకతమణి ఎం. ఎం. కీరవాణి పాడిన టైటిల్ సాంగ్.. ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 1 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ వినూత్నమైన రీతిలో ‘బలమెవ్వడు’ ట్రైలర్ ను లాంచ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పృథ్వీ మాట్లాడుతూ, ”మెడికల్ మాఫియా ఒక కామన్ మ్యాన్ ను ఎంతగా నలిపేస్తోంది. దానిని ఎదుర్కొనడానికి ఆ సామాన్యుడు ఏం చేశాడన్న పాయింట్ తో ఈ సినిమా ఆసక్తికరంగా రూపుదిద్దుకుంది. సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే ఈ సినిమాకోసం నేను పది రోజుల్లో పది కేజీలు తగ్గాను” అని అన్నారు. దర్శకుడు సత్య రాచకొండ మాట్లాడుతూ, ”షూటింగ్ మొదలైన తర్వాత కరోనా కారణంగా నిర్మాతలు వెనక్కి వెళ్లడంతో మేం చాలా ఇబ్బంది పడ్డాం . దాంతో మా అమ్మ, నాన్న నా సినిమా ఆగిపోకూడదని ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి నాకు సపోర్ట్ గా నిలిచి సినిమాను పూర్తి చేశారు. సుహాసిని గారు ‘రాఖీ’ సినిమా తర్వాత అంత పవర్ ఫుల్ రోల్ ఇందులో చేశారు. పృథ్వి గారితో పాటు హీరో హీరోయిన్ లకు అవార్డు వస్తుందనే నమ్మకం కలిగింది” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో ధ్రువన్ కటకం, హీరోయిన్ నియా త్రిపాఠి ఈ మూవీ విజయం పాట్ల ఆశాభావం వ్యక్తం చేశారు.