నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఏడాదిలో రిలీజైన అఖండ.. అఖండ విజయాన్ని అందుకొని రికార్డుల కలెక్షన్లను రాబడుతోంది. ఇక ఆహా లో అన్ స్టాపబుల్ షో తో అలరిస్తున్న బాలయ్య.. ఆయన షో కి వచ్చిన హీరోల సినిమాలను వీక్షించారు. నిన్నటికి నిన్న పుష్ప సినిమాను ఫ్యామిలీతో వీక్షించిన బాలయ్య.. తాజాగా నాని శ్యామ్ సింగారాయ్ సినిమాను వీక్షించారు.
బాలకృష్ణ కోసం నాని స్పెషల్ స్క్రీనింగ్ ని ఏర్పాటు చేశారు. సినిమా చూసిన బాలకృష్ణ నానిపై ప్రశంసల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. సినిమా చాలా బావుందని, నటన అద్భుతంగా చేసినట్లు తెలిపారని సమాచారం. ప్రస్తుతం ఈ బాలయ్యతో శ్యామ్ సింగరాయ్ బృందం కలిసి దిగిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక శ్యామ్ సింగ రాయ్ క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24 న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని మంచి కలెక్షన్లను రాబడుతోంది