డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం లైగర్. ఛార్మి, పూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసం బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్నో సర్ ప్రైజ్ లు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు.
ఇదే పెద్ద ట్విస్ట్ అనుకుంటే మరో ట్విస్ట్ పూరి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పాన్ ఇండియా మూవీలో నందమూరి నట సింహం బాలకృష్ణ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడంట.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ ‘పైసా వసూల్’ చిత్రంలో నటించాడు.. అందులో ఆయన మాస్ క్యారెక్టర్ కి ఫిదా కాని వారుండరు. అప్పటినుంచి పూరి, బాలయ్య మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఉంది.. దీని కారణంగానే లైగర్ లో ఒక క్యామియో రోల్ లో కనిపించడానికి బాలయ్య ఒప్పుకున్నాడని సమాచారం. ఒకవేళ ఇదే కనుక నిజమైతే థియేటర్లో పూనకాలే.. మామూలుగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.. ఇక ఇందులో బాలయ్యబాబు కూడా ఉన్నాడని తెలిస్తే ఫ్యాన్స్ చేసే రచ్చ మాములుగా ఉండదు.. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సిందే.