ప్రముఖ టాలీవుడ్ సీనియర్ దర్శకుడు శరత్ మృతిచెందిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఇక ఈ విషయం తెలియడంతో పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేశారు. దాదాపు 20 సినిమాలకు దర్శకత్వం వహించిన శరత్.. నందమూరి బాలకృష్ణతోనే ఎక్కువ సినిమాలు తీశారు. వంశానికొక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్ లాంటి భారీ విజయాలను బాలయ్య బాబు ఖాతాలో వేసిన దర్శకుడు శరత్. ఇక శరత్ మృతిపై బాలకృష్ణ సంతాపం వ్యక్తం…
ఈ తరం వారికి దర్శకుడు శరత్ అంతగా తెలియకపోవచ్చు. కానీ శరత్ తెరకెక్కించిన సూపర్ హిట్స్ పేరు వింటే ఆయనా ఈ సినిమాలకు దర్శకుడు అని ఆశ్చర్యపోతారు. బాలకృష్ణతో పెద్దన్నయ్య, వంశానికొక్కడు వంటి సూపర్ హిట్స్ తీశారు. సుమన్‌తో బావ-బావమరిది, పెద్దింటి అల్లుడు, చిన్నల్లుడు వంటి విజయవంతమైన సినిమాలు రూపొందించారు. మహానటుడు ఏఎన్నార్ తో కాలేజీ బుల్లోడు, నటశేఖర కృష్ణతో సూపర్ మొగుడు లాంటి చిత్రాలు తీశారు. శరత్ మరణవార్త ఆయనతో పనిచేసిన వారికి దిగ్భ్రాంతి కలిగించింది.…
టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు శరత్ శుక్రవారం ఉదయం అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. తెలుగులో ఆయన దాదాపు 20 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘డియర్’ అనే నవల ఆధారంగా ‘చాదస్తపు మొగుడు’ అనే సినిమాతో ఇండస్ట్రీకి శరత్ పరిచయం అయ్యారు. బాలకృష్ణ, సుమన్ హీరోలుగా సినిమాలు తెరకెక్కించి భారీ విజయాలు సాధించారు. ఏఎన్నార్‌తో ‘కాలేజీ బుల్లోడు’, జగపతిబాబుతో ‘భలే బుల్లోడు’, బాలకృష్ణతో వంశానికొక్కడు, పెద్దన్నయ్య,…