Nandamuri Balakrishna: ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు మృత్యువాత పడడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. లెజెండరీ నటులు ఒకరి తరువాత ఒకరు మృతి చెందడం ఇండస్ట్రీని కుదిపేస్తోంది. కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ, ఇప్పుడు చలపతి రావు.. గతరోజు తెల్లవారుజామున చలపతి రావు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెల్సిందే. సినీ ప్రముఖులు ఆయన కడసారి చూపు కోసం క్యూ కట్టారు. ఆయనతో అనుబంధం ఉన్న ప్రముఖులు, నటులు.. ఆయన పార్థివ దేహాన్నికి నివాళులు అర్పిస్తున్నారు. ఇక చలపతి రావు పార్థివ దేహాన్ని చూడడానికి నందమూరి బాలకృష్ణ రాలేకపోయారు. అందుకు కారణం బాలయ్య.. వీరసింహారెడ్డి షూటింగ్ లో ఉన్నారని టాక్. అయితే బాలయ్యకు, చలపతి రావు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది.
చలపతి రావు, ఎన్టీఆర్ వీరాభిమాని.. అంతేకాకుండా బాలయ్య నటించిన ప్రతి ఫ్యాక్షన్ సినిమాలోనూ చలపతి రావు ఉంటారు. ముఖ్యంగా వీరిద్దరి కాంబోలో వచ్చిన చెన్నకేశవరెడ్డి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. సత్తిరెడ్డి అనే పాత్రలో చలపతి రావు నటించాడు.. ఇప్పటికి ఈ కాంబో ఏదో ఒక మీమ్ లో కనిపిస్తూనే ఉంటుంది. అంతటి అవినాభావ సంబంధం ఉన్న చలపతి రావును చూడడానికి బాలయ్య వచ్చే అవకాశాలుఉన్నాయంటున్నారు. చలపతి రావు కుమార్తెలు అమెరికాలో ఉండడంతో.. వారు వచ్చేవరకు అంత్యక్రియలు నిర్వహించమని చలపతి రావు కుమారుడు రవిబాబు తెలిపారు. ఇక చలపతి రావు అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నారు. ఈ రెండు రోజుల్లో బాలయ్య.. చలపతి రావు కడసారి చూపు కోసం బాలయ్య వస్తాడా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.