నటసింహ నందమూరి బాలకృష్ణ – డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’.. ఈ చిత్రానికి సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయ్యింది. దీంతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసినట్లు చిత్రబృందం తెలిపింది. చివరి షెడ్యూల్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ షూటింగ్ మొత్తం పూర్తవడంతో ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారు.
త్వరలోనే ‘అఖండ’ విడుదల తేదీపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే బాలయ్య చిత్రాన్ని ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారనేది ఆసక్తికరంగా మారింది. సంక్రాంతి బరిలో దిగే ఛాన్స్ లేకపోవడంతో దీపావళికి ఈ సినిమా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.