Akhanda 2 Teaser : ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన అఖండ-2 టీజర్ వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న నాలుగో సినిమా ఇది. వీరిద్దరి కాంబోలో వచ్చిన అఖండ భారీ హిట్ అవడంతో.. పార్ట్-2 తీస్తున్నారు. రామ్ ఆచంట, గోపీ ఆచంటతో కలిసి బాలయ్య కుమార్తె తేజస్విని నిర్మించిన ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందించాడు. తాజాగా మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఫ్యాన్స్ డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని కట్ చేశారు.
Read Also : Akhanda 2 Teaser : అఖండ-2 టీజర్ వచ్చేసింది.. ఫ్యాన్స్ కు పూనకాలే..
మంచులో తీసిన ఫైట్ సీన్ తో టీజర్ మొదలు పెట్టారు. ఇందులో బాలయ్య లుక్ ఊరమాస్ గా ఉంది. నాగసాధు పాత్రలో ఆయన లుక్ అమోఘం. భారీ గడ్డం, జుంపాలతో నిలవెల్లా నాగసాధు లక్షణాలు ఉట్టిపడేలా ఉన్నారు. టీజర్ ఫైట్ సీన్ తోనే స్టార్ట్ అయింది. ‘నా శివుడి ఆజ్ఞ లేనిదే యముడైనా కన్నెత్తి చూడడు.. అలాంటిది నువ్వు చూస్తావా’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ బాగుంది.
ఈ డైలాగ్ తోనే అధర్మం మీద నాగసాధుగా బాలయ్య చేసే పోరాటాన్ని సినిమాలో చూపిస్తున్నట్టు చెప్పేశారు. విలన్లను బాలయ్య తన త్రిషూలంతో అంతం చేసే సీన్ మాస్ ఫ్యాన్స్ ను కట్టిపడేస్తోంది. ‘వేదాలు చదివిన స్వరం యుద్ధానికి ఎదిగింది’ అంటూ విలన్ చెప్పే డైలాగ్ బాలయ్యకు ఎలివేషన్ ఇచ్చేసింది. ఇందులో బాలయ్య పాత్రను మాత్రమే చూపించారు. ఆయన నాగసాధు పాత్రను చూపిస్తూ టీజర్ ను కట్ చేశారు. మాస్, హిందూత్వం కలబోసినట్టు తీశారు. సనాతన ధర్మం గొప్పతనం ఉట్టిపడేలా.. ధర్మాన్ని కాపాడే నాగసాధువుగా బాలయ్య ఇందులో కనిపించారు. యాక్షన్ సీన్లకు తగ్గట్టు తమన్ ఇచ్చిన బీజీఎం అదిరిపోయింది.
తగ తగ తాండవం అంటూ సాగే బీజీఎం లైన్ మాస్ ఎలివేషన్ ఇస్తోంది. మొత్తంగా గంభీరమైన డైలాగులు, నాగసాధుగా బాలయ్య మాస్ లుక్, సీన్ ను ఎలివేట్ చేసే బీజీఎం, అదిరిపోయిన యాక్షన్ సీన్లు.. ఇలా టీజర్ గూస్ బంప్స్ అంతే అన్నట్టు సాగిపోయింది.
Read Also : Balakrishna Fans : థియేటర్లోకి బీర్, ఇడ్లీ.. బాలయ్య ఫ్యాన్స్ హంగామా