Baby The Movie Hindi Remake announcement for this Valentines day: చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది బేబీ మూవీ. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ మరొక కీలక పాత్రలో నటించాడు. అప్పటివరకు కొబ్బరి మట్ట, హృదయ కాలేయం లాంటి కామెడీ సినిమాలు చేసిన సాయి రాజేష్ ఈ సినిమాతో ఒక లవ్ స్టోరీ చేసి దాదాపు 100 కోట్ల వరకు కలెక్షన్లు సాధించారు. ఇక ఈ సినిమాకి తమిళంలో హిందీలో రీమేక్ ఆఫర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాని హిందీలో కూడా సాయి రాజేష్ డైరెక్ట్ చేస్తున్నట్లు నిర్మాత ఎస్కేఎన్ ప్రకటించారు. ఈ సినిమా కథ మీద ఇంట్రెస్ట్ తో పలువురు స్టార్ కిడ్స్ నటించేందుకు ఆసక్తి చూపించారని ఆయన పేర్కొన్నారు. అయితే తెలుగు సినీ పరిశ్రమలాగా హిందీ పరిశ్రమలో ఎవరితో పడితే వాళ్లతో సినిమాలు నేరుగా చేయలేమని ఖచ్చితంగా కాస్టింగ్ డైరెక్టర్స్ తోనే ముందుకు వెళ్లాలని అన్నారు.
Producer SKN: ఫిలిం ఛాంబర్ పై ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ కీలక వ్యాఖ్యలు
ఇప్పటివరకు స్టార్ కిడ్స్ తో కలిపి పది మందిని ఆయా పాత్రల కోసం ఎంచుకున్నామని, ఎవరు ఫైనల్ అవుతారు అనేది ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు. ఈ సినిమా కోసం బాలీవుడ్ లో ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ పని చేస్తున్నారని ఆయన సెట్ అయిన తర్వాత ఆయన ఇచ్చే ట్యూన్స్ ని బట్టి స్క్రిప్ట్ రాసుకోవడానికి సాయి రాజేష్ సిద్ధమవుతున్నాడు అని చెప్పుకొచ్చారు. అయితే ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ చేయడం లేదని హిందీ వాళ్ళ సెన్సిబిలిటీస్ వేరేగా ఉంటాయి కాబట్టి వాటిని బట్టి రీమేక్ చేస్తున్నామని అన్నారు. వాలెంటైన్స్ డే కి సినిమా లాంచ్ చేయాలనుకున్నాం కానీ ఇప్పుడు కొన్ని రోజులు అటు ఇటుగా సినిమా లాంచ్ చేసి అధికారికంగా ప్రకటిస్తామని అన్నారు. కల్ట్ బొమ్మ అనే టైటిల్ రిజిస్టర్ చేసామని అయితే దాన్ని కూడా లేదా అనేది టైంను బట్టి డిసైడ్ అవుతామని చెప్పుకొచ్చారు.