Producer SKN Crucial Comments on Telugu Film Chamber: జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి చిన్న సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా కొనసాగుతున్న ఎస్కేఎన్ ఈ మధ్యనే బేబీ అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు తమిళంలో లవర్ పేరుతో తెరకెక్కిన సినిమాని తెలుగులో ట్రూ లవర్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన రిలీజ్ కాబోతుండగా దానికి సంబంధించిన విశేషాలను ఆయన మీడియాతో పంచుకునేందుకు మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్ మీద ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఈ ట్రూ లవర్ సినిమాని కూడా ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ తెలుగు ఫిలిం ఛాంబర్ ఫిబ్రవరి 9వ తేదీన ఈగల్ సినిమాకి సోలో రిలీజ్ ప్రామిస్ చేసిన నేపధ్యంలో ఫిలిం ఛాంబర్ విజ్ఞప్తి మేరకు తమ సినిమాని ఒక రోజు వెనక్కి వాయిదా వేసినట్టు ఆయన వెల్లడించారు.
Gruha Jyothi Scheme: అద్దెకు ఉండేవారికి గుడ్‌న్యూస్.. కరెంట్ బిల్లుపై TSSPDCL క్లారిటీ..!
అయితే ఫిలిం ఛాంబర్ అన్ని విషయాల్లోనూ అదే విధంగా పట్టు పట్టి ఉండాల్సిందని అన్నారు. ఎందుకంటే ఫిలిం ఛాంబర్ తీసుకున్న ఎనిమిది వారాల ఓటీటీ గ్యాప్ నిర్ణయం చాలా పెద్ద సినిమాల నిర్మాతలే పట్టించుకోవడంలేదని అలాంటి విషయాలు మీద ఛాంబర్ ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. తాను చిన్న నిర్మాత అయినా ఎక్కడ వెనక్కి తగ్గకుండా బేబీ సినిమాకి ఆరు వారాలు తర్వాతే ఓటీటీలో వచ్చేలాగా ప్రయత్నం చేశానని కానీ పెద్ద సినిమాలు కూడా ఇప్పుడు మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీకి ఇచ్చేస్తున్నారని అన్నారు. అలాగే ఈగల్ సినిమా నిర్మాతలతో తనకు తన సహ నిర్మాత మారుతికి మంచి అనుబంధం ఉందని ప్రస్తుతం రాజా సాబ్ సినిమా ఈగల్ నిర్మాతలతోనే చేస్తున్నామని అన్నారు. రవితేజ గారితో పోలిస్తే తమది చిన్న సినిమా, హీరో కూడా ఎస్టాబ్లిష్డ్ హీరో కాదు అయినా సరే చాంబర్ విజ్ఞప్తి మేరకు ఒకరోజు వెనక్కి సినిమాని జరపడం జరిగిందని అన్నారు. అలాగే ఏడాదికి 150కి పైగా సినిమాలు వస్తాయి అలాంటప్పుడు, వారానికి ఒక సినిమా సింగిల్ రిలీజ్ అంటే కష్టం అని కామెంట్ చేశారు.